శుక్రవారం 22 జనవరి 2021
Food - Jul 29, 2020 , 16:36:07

బొబ్బాయి పండుని తిన‌లేక‌‌పోతున్నారా.. అయితే, దీంతో ప్లాస్టిక్ చ‌ట్నీ చేసుకోండి!

బొబ్బాయి పండుని తిన‌లేక‌‌పోతున్నారా.. అయితే, దీంతో ప్లాస్టిక్  చ‌ట్నీ చేసుకోండి!

బొబ్బాయిలో ఎన్నో పోష‌క విలువులుంటాయి. ర‌క్తం త‌క్కువ‌గా ఉండేవారు బొప్పాయి తింటే ఫ‌లితం ఉంటుంది. అలాగే పీరియ‌డ్స్ రాని స‌మ‌యంలో కూడా బొబ్బాయి తింటుంటారు. కానీ బొప్పాయిని డైరెక్టుగా తిన‌డానికి చాలామంది ఇష్ట‌ప‌డ‌రు. అందుకే దీన్ని చ‌ట్నీగా మార్చుకొని ఆహారంలో తీసుకున్నా స‌రిపోతుంది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం బొప్పాయి ప్లాస్టిక్ చ‌ట్నీఎలా త‌యారు చేయాలో చూద్దాం.

కావాల్సిన ప‌దార్థాలు :

బొప్పాయి ముక్క‌లు : ఒక క‌ప్పు

చ‌క్కెర : ఒక క‌ప్పు

ఉప్పు :  రుచికి స‌రిప‌డా

నీరు :  ఒక క‌ప్పు

నిమ్మ‌ర‌సం : 2 టేబుల్ స్పూన్లు

పాంచ్ ఫోరాన్ : ఒక టీస్పూన్‌

(జీర‌, ధ‌నియాల‌, ఎండుమిర్చి) మ‌సాలా : ఒక టీస్పూన్‌

ఆవ నూనె : ఒక టేబుల్‌స్పూన్‌

త‌యారీ :   

ము్ందుగా స్ట‌వ్ మీద క‌డాయి పెట్టుకొని నూనె వేసి వేగ‌నివ్వాలి. అందులో ఎండుమిర్చి, పాంచ్ ఫోరాన్ వేసి వేయించాలి. ఇందులో బొప్పాయి ముక్క‌లు వేసి 3 నిమిషాలు వేయించి నీరు పోయాలి. బొప్పాయి ఉడికిన త‌ర్వాత చ‌క్కెర‌, ఉప్పు వేసి బాగా క‌లిపి మూత పెట్టాలి. ఇందులోని నీరంతా ఆవిరైపోయిన త‌ర్వాత చ‌ట్నీ గ‌ట్టిగా మారుతుంది. ఇదంతా అయ్యేంత‌వ‌ర‌కు స్ట‌వ్‌ను సిమ్‌లోనే పెట్టుకోవాలి. చ‌ట్నీ గ‌ట్టిగా అవ్వ‌కుండా జిగురుగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడురోస్ట్ చేసి పెట్టుకున్న మ‌సాలా మిక్స్ వేసి నిమ్మ‌ర‌సం క‌లిపి స్ట‌వ్ క‌ట్టేసుకోవాలి. ఇక అతే ఎంతో టేస్టీగా ఉండే బొప్పాయి ప్లాస్టిక్ చ‌ట్నీ త‌యారైపోయిన‌ట్లే. దీన్ని వేడి వేడి అన్నంలో క‌లుపుకొని తింటే సూప‌ర్‌గా ఉంటుంది. 

 


logo