గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Apr 20, 2020 , 23:05:06

వ్యవసాయమే భరోసా!

వ్యవసాయమే భరోసా!

కరోనా నుంచి దేశం ఎప్పుడు కోలుకునేది ఎవరూ చెప్పే పరిస్థితి లేకపోవచ్చు. కానీ తదుపరి మన జీవనశైలిలో మార్పులేమిటనే చర్చ మాత్రం అంతటా ఉన్నది. తాగడానికి నీరు, తినడానికి ఆహారం విషయంలో మాత్రం మార్పులుండవు. పంచభూతాల్లో బతుకాల్సిన మనిషి మనుగడకు అవి అనివార్యం.. అమెరికా లాంటి సంపన్నదేశాలు రేపటికాలంలో ఎలా ఉండబోతాయో ఎవరమూ చెప్పలేం. నేటి అభివృద్ధి నమూనాలు రేపు అడుగంటినా ఆదుకోబోయేది మాత్రం వ్యవసాయమే!

విదేశాల్లో చదువులు, ఉద్యోగాలు చేస్తున్న పిల్లల పట్ల తల్లిదండ్రులు ఇప్పుడు బెంగపడ టం సహజమే. మనమూ ఒకప్పుడు వ్యవసా యం చేసుకొని హాయిగా బతికినవాళ్లమే అని నెమరువేసుకుంటున్నవాళ్లూ ఉంటారనడం లో సందేహం లేదు. అది వాస్తం కూడా. అమెరికా, లండన్‌, ఆస్ట్రేలియా కాకపోతే.. ఊరిలో వ్యవసాయం చేసుకొని బతుకగలుగుతామనే ధీమా మాత్రం చాలామందిలో ఇప్పటికే వచ్చి ఉంటది.

దేశంలో ఆర్థికసంస్కరణలు చేపట్టిన తర్వా త వ్యవసాయం దండుగ అన్న పాలకులనే చూస్తూవచ్చాం. విదేశీ పెట్టుబడులు, సేవలరంగం విస్తరణపైనే మన ప్రభుత్వాలు అత్యధికంగా దృష్టిపెట్టి పనిచేశాయి. ఆహారభద్రత కోసం మాత్రం రైతు సమాజాన్ని బలిపీఠమెక్కించాయి. వ్యవసాయాన్ని వదిలి పారిపోయే పరిస్థితులను తెచ్చాయి. దేశంలో 60 శాతం పైగా సేవల రంగంలోనే ఉపాధి పొందతూ వస్తున్నదంటే, అది గాలిలో దీపం లాంటిదని ఇవాళ కరోనా ముట్టడితో అర్థంకాని వారుండరు. సేవల రంగం రేపు కూడా బతికే ఉండొ చ్చు. కానీ ఉపాధి శాతం ఇదేవిధంగా ఉండగలదని ఎవరూ చెప్పలేరు.

వ్యవసాయమే బతికించగలదనే నమ్మకా న్ని ఇవాళ పెంచుతూ వస్తున్న పాలకుడు దేశం లో ఎవరైనా ఉన్నారంటే.. అది కేసీఆరే అనడంలో అనుమానం లేదు. ఉచిత కరెంటు ఇచ్చిన పాలకులు ఉండొచ్చు. కానీ ‘రౌండ్‌ ది క్లాక్‌' ఉచిత కరెంటు ఇచ్చిన పాలకుడు కేసీఆరే. పెట్టుబడికి ఉచిత నగదు ఇచ్చిన పాలకుడూ ఆయనే. రైతు ప్రాణానికి భద్రత కల్పిస్తూ రూ.5 లక్షల బీమా కల్పించిందీ ఆయనే. ఆరేండ్లలో కొత్త గా లక్షల ఎకరాలకు సాగునీరందించిన పాలకుడూ ఆయనే. దేశంలో అమలవుతున్న ఆర్థిక సంస్కరణల అడ్డంకులే లేకపోయి ఉంటే, కనీస మద్దతు ధర నిర్ణయించే అధికారమే ఉం టే, కేసీఆర్‌ అది కూడా చేసి చూపేవాడే!

కరోనా వైరస్‌ వస్తుందని ఎవరూ ఊహించరు. దాని అనంతరం భవిష్యత్తు ఇలా ఉంటుందనీ ఎవరూ ఊహించలేరు. కానీ మనిషికి ఎలాంటి సవాళ్లు, సమస్యలు, ఆపద సమయాలు వచ్చినా బతికించగలిగేది వ్యవసాయమే.

వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఆయ న సంకల్ప బలమే తెలంగాణ వ్యవసాయానికి పునరుజ్జీవం పోస్తూ వస్తున్నది. కరోనా తదుపరి పరిస్థితులను అంచనా వేస్తే, తెలంగాణ ప్రజల జీవన భద్రతకు మాత్రం ఢోకా లేదనే చెప్పాలి. సాగు, తాగునీటికి ఆరేండ్లుగా లభించిన ప్రాధాన్యం ఆ భద్రతకు ఆధారం. రెండు జీవనదుల్లో తెలంగాణకు గల 1250 టీఎంసీ ల కేటాయింపులపై సీఎం కేసీఆర్‌ తదేకంగా దృష్టిపెట్టి పనిచేస్తున్నారు. దశాబ్దాలుగా తెలంగాణలో ఎండకాలం వచ్చిందంటే, చెరువులు ఎండిపోయిన దృశ్యాలే మనకు గుర్తు. ఆరేండ్లుగా ఆ పరిస్థితి మారుతున్నది. ఎండిపోయి న ఎగువ గోదావరిని సుమారు 150 టీఎంసీలతో జీవనదిగా మార్చిన ఘనత కేసీఆర్‌దే. ఎండిపోయిన చెరువులూ చాలామేరకు పునరుజ్జీవం పొందాయి. తెలంగాణ వచ్చిననాడు ప్రాజెక్టుల కింద 11 లక్షల ఎకరాలకు మించి సాగు కాలేదు. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు జిల్లాలో పూర్తిచేసిన పెండింగ్‌ ప్రాజెక్టుల వల్ల కొత్తగా 40 లక్షల ఎకరాల్లో పంటలను చూస్తున్నాం. ఇవాళ 50 లక్షల టన్నుల ధాన్యం, 14 లక్షల టన్నుల మక్కల ఉత్పత్తి తెలంగాణ వ్యవసాయానికి వచ్చిన మంచి రోజులని చెబుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత పంట దిగుబడి వచ్చేదో, ఇప్పుడు తెలంగాణలోనే అంతకుమించిన దిగుబడి వస్తున్నదంటే.. ఆరేండ్లలో పెరిగిన సాగునీటి వసతే అందుకు కారణం. తమిళనా డు, కర్ణాటక, కేరళ, బెంగాల్‌ వంటి రాష్ర్టాల కూ తెలంగాణ బియ్యం సరఫరా చేయబడుతున్నాయంటే ఆరేండ్లలో తెలంగాణ ఏ స్థాయి కి ఎదిగిందో చెబుతున్నది.

కాళేశ్వరం ప్రాజెక్టు సంపూర్ణమైతే, పాలమూరు, సీతారామ వంటి మేజర్‌, మీడియం ప్రాజెక్టులు పూర్తయితే కేసీఆర్‌ ఊహించిన కోటి ఎకరాలే కాదు, అంతకుమించిన ఎకరాల్లోనే వ్యవసాయం ఫరిడవిల్లనున్నది. తెలంగాణను స్వావలంబిత రాష్ట్రంగా మార్చడంలో కేసీఆర్‌ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన శక్తిమేరకు పనిచేస్తున్నారు. ఇవాళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు ఉత్పత్తిని ప్రైవేటు రం గానికి అప్పగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న యాదాద్రి, భద్రాద్రి వంటి విద్యుత్తు ప్లాంట్లను ప్రభత్వరంగంలోనే చేపట్టడాన్ని మనం గమనించవచ్చు. సాగునీటి ప్రాజెక్టుల కు అవసరమైన విద్యుత్తు కోసం, పరిశ్రమల కోసం, ప్రైవేటురంగంపై ఆధారపడకుండా విద్యుత్‌రంగంలో స్వావలంబన సాధించడమే లక్ష్యంగా కేసీఆర్‌ పనిచేయడాన్ని మనం గమనించవచ్చు. దేశంలో అనేక రాష్ర్టాలు తాగునీటిని సైతం ప్రైవేట్‌రంగానికే అప్పగిస్తున్నాయి. కానీ తెలంగాణలో రూ.40 వేల కోట్లతో మిష న్‌భగీరథను చేపట్టి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలోనూ కనిపించేది స్వావలంబనే. భారీ సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్‌, తాగునీటి రంగాల్లో తెలంగాణను స్వావలంబి త రాష్ట్రంగా మార్చుతున్న ఘనత కేసీఆర్‌దే. 

కరోనా తదుపరి పరిస్థితులను సైతం తట్టుకొ ని నిలబడగలిగే శక్తి తెలంగాణ స్వావలంబిత విధానాల్లో మనకు కనిపిస్తుంది. కరోనా వైరస్‌ వస్తుందని ఎవరూ ఊహించరు. దాని అనంత రం భవిష్యత్తు ఇలా ఉంటుందనీ ఎవరూ ఊహించలేరు. కానీ మనిషికి ఎలాంటి సవాళ్లు, సమస్యలు, ఆపద సమయాలు వచ్చినా బతికించగలిగేది వ్యవసాయమే. ఒకవేళ కరోనా తర్వా త ఉపాధి పరిస్థితులు తిరోగమనం పడితే వ్యవసాయమే నిలబెడుతుంది. ఆధునిక వ్యవసా యం కొత్త పుంతలు తొక్కవచ్చు. వ్యవసాయరంగంలో కొత్త ఉపాధిమార్గాలు రావచ్చు. ఇవ న్నీ ఎలా జరుగగలుగుతాయి? మౌలిక వసతు లు తెలంగాణలో ఇప్పటి కే ఏర్పడుతున్నాయి. పూర్తయిన, ఆన్‌గోయిం గ్‌ ప్రాజెక్టుల ద్వారా 12 వందలకుపైగా టీఎంసీ ల సాగునీరు అందుబాటులోకి  రాబోతున్నది. అలా వ్యవసాయానికి కేసీఆర్‌ ఆరేండ్లుగా పునరుజ్జీవం పోస్తూ వస్తున్నారు. వారి కల నెలవేరడంలో ఆలస్యం లేదు. అలాగే కరోనా తదుపరి భవిష్యత్తుకు తెలంగాణ వ్యవసాయం భరోసాను ఇవ్వగలదనడంలోనూ సందేహం లేదు.


logo