బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Feb 01, 2020 , 23:31:25

దేశానికి కేసీఆర్‌ నమూనా

దేశానికి కేసీఆర్‌ నమూనా

బీజేపీని ఎదిరించడానికి పాత రాజకీయ ఆర్థిక నమూనాలేవీ పనికిరావని ఇప్పుడున్న రాజకీయపక్షాలన్నీ తెలుసుకోవాలి. తన ఆర్థిక నమూనా నుంచి, ఆర్థిక వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అత్యంత శక్తివంతమైన, ఉన్మాదపూరితమైన భావోద్వేగ రాజకీయాలను బీజేపీ చేస్తున్నది. ఎయిర్‌ ఇండియాతో సహా ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతూ అది కూడా దేశభక్తిలో భాగమే అని చెప్పగల నేర్పును బీజేపీ ప్రదర్శిస్తున్నది. ఈ ఉద్వేగాల మబ్బులను తుత్తునియలు చేయగల అత్యుత్తమ అభివృద్ధి నమూనాను ప్రతిపాదించగలిగితే తప్ప బీజేపీని ఎదిరించడం సాధ్యం కాదు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆర్థిక నమూనా దేశంలో రాజకీయ ఏకీకరణకు ఒక కొత్త నమూనాగా ఉపయోగపడుతుంది. కేసీఆర్‌ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు సంపద సృష్టికి, సంపద వికేంద్రీకరణకు దోహదం చేస్తున్నాయి. రాష్ట్ర నికర ఆదాయంలో అత్యధిక శాతం నీటిపారుదల అభివృద్ధికి, నిరంతర విద్యుత్‌ సరఫరాకు, రైతులకు పెట్టుబడి సమకూర్చడానికి ఖర్చుచేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు.

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి న ఆర్థిక సర్వే, బడ్జెట్‌ బీజేపీ ప్రభుత్వ మౌలిక స్వభావాన్ని మరింత స్పష్టంగా బయటపెట్టాయి. బీజేపీ ప్రభు త్వం అన్ని ముసుగులు తొలిగించుకోవడానికి సిద్ధపడిందని ఆర్థిక సర్వే చేసిన సూచనలు, బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించి న విషయాలు తెలియజేస్తున్నాయి. దేశానికి ప్రో-బిజినెస్‌ ఆర్థిక విధానాలు కావాలని బీజేపీ ప్రభుత్వం అధికారికంగా ఉద్ఘాటించింది. ‘ప్రో-బిజినెస్‌' అంటే ‘వ్యాపా ర అనుకూల, పారిశ్రామిక అనుకూల’ విధానాలు కావాలని సర్వే ప్రవచించింది. ఇప్పటిదాకా ఆచరిస్తున్నది వ్యాపార అనుకూల విధానాలు కావా, ఇందులో కొత్త ఏముందని ఎవరైనా అడుగవచ్చు. 


వ్యాపార అనుకూల విధానాలనే మరింత పచ్చి గా, కచ్చితంగా అమల్లోకి తీసుకువచ్చే విధాన ప్రకటనగా దీన్ని చూడాలి. ఇప్పటిదాకా ప్రజారంజకత్వం అనే ఒక పల్చని ముసుగు ఉండేది. ఇప్పుడు ఆ ముసుగు లు కూడా తప్పించాలన్నది సర్వే సిఫారసు. ప్రజావ్యతిరేక విధానాలను సర్వే దాచుకోలేదు. ప్రజలకిచ్చే ఆహార సబ్సిడీలు తగ్గించాలి. రేషన్‌ ధరలను సమీక్షించాలి. రుణాల మాఫీ చేయకూడదు. ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు. ఉద్యోగులు, కార్మికుల హక్కులకు గ్యారెంటీలు ఉండకూడదు. సంపద సృష్టిపై దృష్టిని కేంద్రీకరించాలి. వ్యాపార విస్తరణకు దోహదం చేయాలి. ఈ విధానాలన్నీ చాలాకాలంగా ఆచరణలో ఉన్నాయి. సర్వే సూచనలకు కొనసాగింపుగానే సంపద సృష్టించేవారిని గౌరవిస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి వెల్లడించారు.


సంపద సృష్టించేవారంటే బీజేపీ దృష్టిలో ప్రోబిజినెస్‌ వర్గాలని వేరే చెప్పనవస రం లేదు. ప్రో బిజినెస్‌ విధానాలను ఇప్పుడు మరింత వేగంగా, విస్తృతంగా, నిక్కచ్చిగా అమలుచేయడానికి బీజేపీ సన్నద్ధమవుతున్నది. బీజేపీ ప్రభుత్వం గత కొనేం డ్లలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి రాజకీయ అవసరాల కోసం తెచ్చినవే. చాలా విధానాలు రాజకీయ ప్రత్యర్థుల నుంచి స్వీకరించినవే. బీజేపీ ఇష్టపడి చేసిన ప్రజారంజక నిర్ణయం ఒక్కటి కూడా లేదు. రైతు బంధు, రైతు బీమా ఏవైనా తెలంగాణ ప్రభుత్వం నుంచి స్వీకరించిన విధానాలే. 


కొన్ని రాష్ర్టాల్లో రుణమాఫీ చేయడానికి కూడా ప్రేరణ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే. ఎవరైనా అర్థం చేసుకోవలసింది ఒక్కటే, ప్రో బిజినెస్‌, ప్రో పీపుల్‌ అనేవి ఒకే ఒరలో ఇమిడే నినాదాలు కాదు. అవి పరస్పర విరుద్ధమైనవి. సమాజం దీర్ఘకాలిక సంక్షేమం ఈ రెండు విధానాల్లో ఏది అనుసరిస్తామన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సంపద కేంద్రీకరణ జరుగుతున్నదని, పేదలకు పెద్దలకు మధ్య పూడ్చలేని భయంకరమైన అంతరం పెరుగుతున్నదని ఇటీవలి అం తర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రో బిజినెస్‌ అన్నది సంపద కేంద్రీకరణకు మూలం. ప్రో పీపుల్‌ అన్నది సంపద వికేంద్రీకరణకు మూలం. సంపద కేంద్రీకరణకు నమూనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. సంపద వికేంద్రీకరణకు నమూ నా కేసీఆర్‌ విధానాలు.


దేశంలో సృష్టించపబడుతున్న సంపదలో కేవలం ఐదు శాతం మాత్రమే తొంభైశాతంగా ఉన్న ప్రజలకు దక్కుతున్నది. అత్యధిక శాతం సంపద తిరిగి సంపన్నవర్గాల చేతుల్లోకి వెళుతున్నది. ఈ అంతరాన్ని మరింత పెంచేందుకు బీజేపీ ప్రభు త్వం పూనుకుంటున్నది. ప్రో క్రోనీ విధానాల స్థానంలో ప్రో బిజినెస్‌ తీసుకొస్తామ ని సర్వేలో చెప్పడం బీజేపీ ప్రభుత్వ వంచనశిల్పానికి ప్రతీక. ఐదున్నరేండ్లుగా అధికారంలో ఉన్నవారు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రో క్రోనీ-తొత్తు పారిశ్రామికులను కాకుండా నిజమైన పారిశ్రామికులను ప్రోత్సహిస్తామని చెబితే ఎవరు నమ్ముతారు? బీజేపీ ప్రభుత్వం ఎవరికి మేలు చేస్తున్నదో ఎవరిని ప్రత్యేకంగా చూస్తున్నదో అందరికీ అర్థమవుతూనే ఉన్నది. బీజేపీ ప్రభుత్వం కిరణా వ్యాపారుల కోసం ఒక పిం ఛను పథకాన్ని తెచ్చింది. 


మూడు కోట్ల మందికిపైగా చిన్న వ్యాపారులకు నెలకు మూడువేల పింఛను ఇచ్చే ఈ పథకం ముమ్మాటికీ మంచిదే. బహుళజాతి సంస్థలు చిల్లర వ్యాపారంలోకి వచ్చి, చిన్న వ్యాపారులను వీధిపాలు చేస్తున్నవేళ ఇటువంటి పథకం అవసరమే. కానీ ఇటువంటి పింఛను పథకాన్ని ఆరుగాలం కష్టపడే రైతులకోసం ఎందుకు ప్రవేశపెట్టలేదు? భూమి లేకుండా కేవలం రెక్కల కష్టాన్ని నమ్ముకునే రైతు కూలీలకు ఎందుకు తీసుకురాలేదు? కార్మికులు, యాజమాన్యాల కంట్రిబ్యూషన్‌తో నడిచే పీఎఫ్‌ నుంచి రిటైరైన కార్మికులకు ఇచ్చే కనీస పింఛన్ను ఐదువేలకు పెంచాలన్న కోట్లాదిమంది కార్మికుల కోరికను ఎందుకు మన్నించలేదు? ఈ అసంఖ్యాక ప్రజానీకాన్ని వదిలేసి ఒకవర్గాన్ని మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఎంచుకున్నది?


ఎందుకంటే బీజేపీ తన ఓటు బ్యాంకు అక్కడే ఉన్నదని భావించింది కాబట్టి. కేంద్రంలో రైతుబంధు రావడానికి ప్రేరణ తెలంగాణ రైతుబంధు పథకమేనని వారే అంగీకరించారు. తాజా ఆర్థికసర్వేలో రైతుబంధు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించా రు కూడా. పారిశ్రామిక వర్గాలకు వందల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు సమకూర్చి, అవి దెబ్బతింటే ఆ రుణాలను మాఫీ చేసి బ్యాంకుల నష్టాల్లో జమ రాసే అధికార యంత్రాంగం రైతులకు పెట్టుబడి సమకూర్చడానికి ఎందుకు తటపటాయిస్తున్నాయి? దేశంలో అత్యధిక ప్రజానీకం ఇంకా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నది. రైతులకు నీరు కరెంటు పెట్టుబడి సమకూర్చితే అద్భుతాలు సృష్టిస్తారు. తెలంగాణ అనుభవం ఇందుకు ప్రబల నిదర్శనం. 


ఆహార ఉత్పత్తిని ఒక పరిశ్రమగా ఎందుకు పరిగణించరు? ఆహార ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నా ఎగుమతుల్లో మనం బాగా దిగువ శ్రేణిలో ఉన్నాం. ఎందుకంటే మన దేశ జనాభా వినియోగానికే మన ఆహార ఉత్పత్తులు ఎక్కువగా ఖర్చవుతున్నాయి. ఆహార ఉత్పత్తిని, ఎగుమతులను రెట్టింపు చేయడానికి బ్రహ్మాండమైన అవకాశాలున్నాయి. తెలంగాణలో మాదిరిగా దేశవ్యాప్తంగా రైతులకు సాగునీరు, కరెంటు, పెట్టుబడి సమకూర్చితే దేశం ఆహార ఉత్పత్తిలో విప్లవం సృష్టిస్తుంది. బీజే పీ తన సహజ స్వభావరీత్యా ఈ రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రజలకు సబ్సిడీ లు ఎందుకు అని ఆలోచించే ప్రభుత్వాలు సామాజిక సంక్షోభాలకు కారణమవుతాయి. బీజేపీ తను ఎంచుకున్న ఆర్థిక నమూనాను మార్చుకోకపోతే అదింకా ఇంకా ప్రజలకు దూరం కాకతప్పదు.


బీజేపీని ఎదిరించడానికి పాత రాజకీయ ఆర్థిక నమూనాలేవీ పనికిరావని ఇప్పుడున్న రాజకీయపక్షాలన్నీ తెలుసుకోవాలి. తన ఆర్థిక నమూనా నుంచి, ఆర్థిక వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అత్యంత శక్తివంతమైన, ఉన్మాదపూరితమైన భావోద్వేగ రాజకీయాలను బీజేపీ చేస్తున్నది. ఎయిర్‌ ఇండియాతో సహా ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతూ అది కూడా దేశభక్తిలో భాగమే అని చెప్పగల నేర్పును బీజేపీ ప్రదర్శిస్తున్నది. ఈ ఉద్వేగాల మబ్బులను తుత్తునియలు చేయగల అత్యుత్తమ అభివృద్ధి నమూనాను ప్రతిపాదించగలిగితే తప్ప బీజేపీని ఎదిరించడం సాధ్యం కాదు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆర్థిక నమూ నా దేశంలో రాజకీయ ఏకీకరణకు ఒక కొత్త నమూనాగా ఉపయోగపడుతుంది. కేసీఆర్‌ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు సంపద సృష్టికి, సంపద వికేంద్రీకరణకు దోహదం చేస్తున్నాయి. రాష్ట్ర నికర ఆదాయంలో అత్యధిక శాతం నీటిపారుదల అభివృద్ధికి, నిరంతర విద్యుత్‌ సరఫరాకు, రైతులకు పెట్టుబడి సమకూర్చడానికి ఖర్చుచేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు.


వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ఒక గొప్ప యజ్ఞం రాష్ట్రంలో నడుస్తున్నది. కాళేశ్వరం నీరు గత మూడు మాసాలుగా నిరాటంకంగా కాలువల్లో ప్రవహిస్తున్న ది. కొన్ని చెరువులు, రిజర్వాయర్లు మూడున్నర మాసాలుగా అలుగు పోస్తున్నాయి. సాగు నీరు, తాగు నీరు విషయంలో తెలంగాణ ఒక సంతృప్తస్థితిని అందుకోవడానికి సిద్ధమవుతున్నది. కరెంటు కొరత లేదు. పెట్టుబడులు అందుతున్నాయి. తెలంగాణ సమాజం స్వావలంబన సాధించడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఇదే నమూనా దేశవ్యాప్తం కావాలి. దేశంలో నదుల్లో నీరు ఉన్నది. కరెంటు ఉత్పత్తికి మెండైన అవకాశాలున్నాయి. ప్రగతిశీల విధానాలతో యుద్ధప్రాతిపదికన ఈ నమూనాను అమల్లో పెట్టాలి.  


తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నన్ని సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రమూ అమ లుచేయడం లేదంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి-షాదీముబారక్‌, అట్టడుగువర్గాలకు అందిస్తున్న ప్రోత్సాహక పథకాలు వేల కోట్ల రూపాయాలను తిరిగి తెలంగాణ ప్రజానీకానికి చేరవేస్తున్నాయి. రాష్ట్ర ఆదాయంలో సంక్షేమం వాటా 25 శాతం. ఇదే నమూనా దేశవ్యాప్తం కావాల్సి న అవసరం ఉన్నది. అలా జరుగాలంటే ఒక బలమైన రాజకీ యశక్తి ఆవిర్భవించాలి. ప్రత్యామ్నాయ ఆర్థిక నమూనా కోసం ఆలోచించే వివిధ జాతీయ, ప్రాంతీయ రాజకీయశక్తులు ఒక్కటి కావాలి. అటువంటి రాజకీయ ఏకీకరణకు చొరవతీసుకోవడానికి కేసీఆర్‌ ముందుకురావడం శుభపరిణామం.

[email protected]


logo