Better medical care | మెరుగైన వైద్య సేవలందించడమే ప్రభుత్వలక్ష్యం

కవాడిగూడ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
శుక్రవారం భోలక్పూర్ యూపీహెచ్సీని ఆయన సందర్శించారు. దవాఖానలో రోగుల పరిస్థితిని డాక్టర్ కృష్ణమోహన్ రావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దవాఖాన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచించారు.
దవాఖాన ప్రాంగణంలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను జీహెచ్ఎంసీ సిబ్బందితో తొలగింపజేశారు. ముషీరాబాద్, భోలక్పూర్ యూపీహెచ్సీలు రెండు ఒకేచోట ఉండడంతో రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా షెడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, నాయకులు శ్రీనివాస్, శ్రావణ్కుమార్, ఏ.శంకర్ గౌడ్, రహీం, మోజెస్, మున్వర్ చాంద్, ప్రవీణ్, ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

