environmental protection

మన్సూరాబాద్ : పర్యావరణ పరిరక్షణ కోసం రోడ్లకు ఇరువైపుల, ఖాళీ ప్రదేశాలలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి హిందూ అరణ్య ఎదురుగా ఫతుల్లాగూడకు వెళ్లే దారిలో నూతనంగా నిర్మిస్తున్న స్మశానవాటిక వరకు ఏర్పాటు చేసిన రోడ్డును బుధవారం ఆయన మార్నింగ్ వాక్‌లో పరిశీలించారు. అనంతరం ఆ ప్రాంతంలో సుమారు 2.5 కిలోమీటర్ల పొడవునా నాటిన 25 వేల మొక్కలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటడం వల్ల స్వచ్ఛమైన గాలి లభించడమే కాక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెరుకు ప్రశాంత్‌గౌడ్, తూర్పాటి చిరంజీవి, తూర్పాటి కృష్ణ, సుర్వి రాజుగౌడ్, పోచబోయిన జగదీష్‌యాదవ్, మహేష్‌రెడ్డి, చెరుకు జంగయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.