మహేశ్వరం : అభివృద్ది పనులకు ఆకర్షితులై మహేశ్వరం మండల కాంగ్రెస్ నాయకుడు కాకిమల్లేష్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈసందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత స్థానం లబిస్తుందని అన్నారు.
ప్రతి ఒక్కరు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరేవిదంగా తగు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి నాయకులు కూనయాదయ్య, కరోళ్లచంద్రయ్యముదిరాజ్, కోఆప్షన్ సభ్యులు ఆదిల్ అలీ, మాజీ సర్పంచ్ ఆనందం,మాజీ ఉపసర్పంచ్ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.