Development | అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

చిక్కడపల్లి : అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర ఈశాన్య ప్రాంత పర్యాటక సంస్కృతి, అభివృద్ధి మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలో శుక్రవారం రూ.52 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ పావని వినయ్కుమారుతో కలిసి శంకుస్థాపన చేశారు.
వై జంక్షన్ నుంచి ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ వరకు రూ.32 లక్షలతో,నర్మద హాస్పిటల్ వద్ద రూ.10.50 వీడీసీసీ రోడ్డు పనులకు,అదే విధంగా అశోక్ నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణ పనులకు రూ.10 లక్షలతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

కరోనా వ్యాప్తి వేగవంతం అవుతుందని తప్పకుండా కొవిడ్ నిబందనలు పాటించాలని సూచించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు కరోనా కట్టడికి కృషి చేస్తున్నాయని అన్నారు.ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యం అవుతుందని తెలిపారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
అందులో భాగంగానే డివిజన్ల వారిగా అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మెర్చా జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జయ సింహ, జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, వర్క్ ఇన్స్పెక్టర్ రఘురాం,టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోతుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

