బండ్లగూడ: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం గణేష్ ఉత్సవాల సందర్భంగా రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేవారు ఖచ్చింతగా అధికారుల నుంచి అనుమతి పొందలన్నారు.
వినాయక నిమజ్జనం సమయంలో తగిన జాగ్రతలు పాటించాలన్నారు.అధికారులు కూడా ఎప్పటికప్పుడు వినాయక నిమజ్జనాలను పరిశీలించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. చెరువు, కుంటల వద్ద విలైనన్ని క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జనాలు త్వరగా జరిగేలా చూడాలన్నారు. కొవిడ్ నింబంధనలు పాటిస్తు ఉత్సవాలను జరుపుకోవాలని కమిటి సభ్యులకు సూచించారు.కార్యక్రమంలో రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ ఆశోక్ సామ్రాట్, ఉప కమిషనర్ జగన్, కార్పొరేట్లర్లు స్థానిక నాయకులు గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.