కొండాపూర్ : కొత్తగూడ ప్రభుత్వ పాఠశాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు జీ వినోద్ కుమార్ రంగారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా, జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రమును అందుకున్నారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. భవిష్యత్తులో ఉత్తమ బోధనలను అందజేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకుడిగా నిలుస్తానన్నారు. కొత్తగూడ పాఠశాల నుంచి ఉత్తమ ఫలితాలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.