ఎరగడ్డ : బోరబండకు చెందిన 25 మంది మహిళలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరుకాగా వాటిని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి లబ్దిదారులకు సోమవారం పంపిణీ చేశారు. సైట్-1 కాలనీ తుర్రెబాజ్‌ఖాన్ కమ్యూనిటీహాల్లో జరిగిన కార్యక్రమంలో రూ.25 లక్షల 2వేల 900 విలువగల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గోపీనాథ్, బాబా ఫసియుద్దీన్‌లు మాట్లాడుతూ ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న మిగతా వాళ్లలో అర్హులైన వారికి త్వరలో చెక్కులు మంజూరౌతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, పార్టీ నేతలు ఎన్.విజయకుమార్, రమేష్‌యాదవ్,. ప్రధాన, అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు.