మన్సూరాబాద్ : పేదల సంక్షేమంకోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి నాగోల్ ఓల్డ్విలేజ్కు చెందిన స్వతంత్య్ర కుమార్‌గౌడ్ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకున్నాడు. చికి త్స ఖర్చును భరించలేని స్థితిలో ఉన్న కుటుంబసభ్యులు విషయాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే ఆయన స్పందించి సీఎం సహాయనిధి నుంచి రూ. 1.25 లక్షల చెక్కును మంజూరు చేయించి బుధవారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం సహాయనిధి ద్వార ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనంతుల రాజిరెడ్డి, చంద్రశేఖర్ ఆజాద్, బోడ బిక్షపతి, భాస్కర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.