రవీంద్రభారతి : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలుగు సాహిత్య కళాపీఠం సాహిత్య సాంస్కృతిక, సామాజిక సేవాసంస్థ సంయుక్త నిర్వహణలో పదవ వార్షికోత్సవ జీవన సాఫల్య పురస్కారాల ప్రధాన కార్యక్రమం శుక్రవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న హాజరై మాట్లాడుతూ తెలుగు సాహిత్య కళాపీఠం వదవ వార్షికోత్సవ సందర్భంగా పలువురు కళాకారులకు జీవన సాఫల్య పురస్కారాలు అందజేయడం ఎంతో అభినందనీయ మన్నారు.
కవులు, కళాకారులు, సంఘ సేవకులకు ఇలాంటి పురస్కారాలు అందజేస్తే వారు సమాజానికి మరింత ఉత్సహాంగా సేవసేస్తారన్నారు. జీవన సాఫల్య పురస్కారాలు కురిమిళ్ల నర్సింహగౌడ్, చెరుపల్లి యాదగిరిలకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు డా. ఓలేటి పార్వతీశం, వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్క రామదాస్, చిక్కా దేవదాస్, దైవజ్ఞశర్మ, చిక్క శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మిర్యాల నిఖలచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. కవులు, కళాకారులచే కవిసమ్మేళనం జరిగింది.