e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జనగాం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పాకాలకు మహర్దశ

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పాకాలకు మహర్దశ

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పాకాలకు మహర్దశ

సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే పెద్దికి రుణపడి ఉంటాం
ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ రామస్వామినాయక్‌
సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం

ఖానాపురం, ఏప్రిల్‌ 11: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాకాలకు మహర్దశ పట్టిందని ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోత్‌ రామస్వామినాయక్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులతో కలిసి సీఎం కేసీఆర్‌, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకతీయ రాజులు నిర్మించిన పాకాల సరస్సు ఈ ప్రాంత రైతుల కల్పతరువు అని, సరస్సుపై ఆదారపడి వేలమంది జీవిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ అండదండలతో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పాకాలకు శాశ్వత జలవనరులను కల్పించే ప్రాజెక్టును సాధించారన్నారు. ఆయకట్టు ప్రాంతం కోనసీమను తలపించేవిధంగా సస్యశ్యామలం కానుందని తెలిపారు. పాకాలకు గోదావరి జలాల కలను నిజం చేసినందుకు సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఆయకట్టు రైతులు జీవితాంతం రుణపడి ఉంటారని అన్నారు. ప్రాజెక్టు సాధనకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే పెద్దికి సన్మానం
పాకాలకు గోదావరి జలాలను తీసుకువచ్చి ఈ ప్రాంత రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పార్టీ మండల నాయకులు, రైతులు క్యాంపు కార్యాలయంలో కలిసి శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహాలక్ష్మి-వెంకటనర్సయ్య, రైతుబంధు మండల కన్వీనర్‌ వెంకట్‌రెడ్డి, తుంగబంధం కన్వీనర్‌ కిషన్‌రావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
దబ్బవాగు వద్ద రైస్‌ మిల్లర్ల పూజలు
నర్సంపేట : గోదావరి జలాలతో నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ నర్సంపేట అధ్యక్షుడు శ్రీరాం ఈశ్వరయ్య అన్నారు. ఆదివారం గోదారమ్మ రాక ను పురస్కరించుకుని దబ్బవాగు వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి జలాలను నియోజకవర్గానికి తీసుకురావడంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు శింగిరికొండ మాధవశంకర్‌, చకిలం కృష్ణమూర్తి, ఇరుకు కోటేశ్వర్‌రావు, మోతె జైపాల్‌రెడ్డి, దుబ్బ రమేశ్‌, పబ్బ రమేశ్‌, మాదారపు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

వీరాయిపల్లిలో వేరుశనగ పరిశోధన కేంద్రం

చిరంజీవి లూసీఫర్ రీమేక్ కు అదిరిపోయే టైటిల్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పాకాలకు మహర్దశ

ట్రెండింగ్‌

Advertisement