Joining trs |అభివృద్థి కార్యక్రమాల అమలులో తెలంగాణ ఆదర్శం : మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్

బేగంపేట్ : అభివృద్థి కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగ నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రాంగోపాల్‌పేట్ డివిజన్‌కు చెందిన బీజేపీ పార్టీ కార్యకర్తలు ప్రశాంత్‌సింగ్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వెస్ట్ మారేడ్‌పల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నివాసంలో పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంధర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తుందని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి గెలిచి రెండు సంవత్సరాలు దాటిన నేటి వరకు ఒక్కసారైన ఈ ప్రాంత ప్రజలకు కలిశారా అని ప్రశ్నించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రికి లేదా అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాను సనత్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు.
కోట్లాది రూపాయల వ్యయంతో గతంలో ఎన్నడు లేని విధంగ అనేక అభివృద్ధి పనులు చేసినట్టు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయక్తత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రశాంత్ సింగ్ తెలిపారు.
పార్టీలో చేరిన వారిలో భరత్,వినాయక్సింగ్, విక్రాంత్సింగ్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు అత్తెలి శ్రీనిస్ గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

