కోటపల్లి, ఆగస్టు 2 : పెండ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట, చావు డప్పులు వినిపించేలా చేసింది విధి. మరో 14 రోజుల్లో కూతురు వివాహం పెట్టుకోగా, ఇంతలోనే ఆమె తండ్రి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి గ్రామ పంచాయతీలో ఆదివారం చోటు చేసుకున్నది. వివరాలిలా.. కోటపల్లి గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా కత్తెర్ల శంకర్ (45) విధులు నిర్వర్తిస్తున్నాడు.
గిరిజనుడైన శంకర్ కూలీ పనులు సైతం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు నిద్ర లేచిన శంకర్ బయటకు వెళ్లి వచ్చి, తిరిగి పడుకున్నాడు. తెల్లారినా లేవకపోయేసరికి అతడి భార్య పద్మకు అనుమానం వచ్చింది. అతడిని నిద్రలేపేందుకు ప్రయత్నం చేయగా నిర్జీవంగా కనిపించాడు. శంకర్‌కు ఇద్దరు కూతుళ్లు కాగా, పెద్ద కూతురైన సాయి కీర్తనకు పెండ్లి నిశ్చయమైంది. ఈనెల 16న వివాహానికి ఏర్పాట్లు చేస్తుండగా, ఇంతలోనే శంకర్ మృతి చెందాడు.