DMK : ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ని చూసి భయపడుతున్నారా..? అని కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ని ప్రతిపక్ష డీఎంకే (DMK) ప్రశ్నించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న నిరసన కార్యక్రమానికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఊహించని రాజకీయ సెగ తగిలింది.
తమిళనాడులో ఒకప్పటి మిత్రపక్షమైన డీఎంకే పార్టీ రాహుల్‌గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించింది. డీఎంకే నేత శరవణన్ అన్నాదురై ‘ఎక్స్’ వేదికగా రాహుల్‌గాంధీని సూటిగా ప్రశ్నించారు. తమిళనాడులో ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల తొలగింపుపై రాహుల్‌గాంధీ వైఖరి ఏమిటని, ‘సర్’ అనంతరం ఎన్నికైన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయాలన్న మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను రాహుల్‌గాంధీ ఎందుకు సమర్థించడం లేదని నిలదీశారు. ఇది ఎంతటి ద్వంద్వ నీతి అంటూ తన పోస్టులో రాహుల్‌గాంధీని ఘాటుగా విమర్శించారు.