– అక్రమణదారులపై చర్యలు
– తాసీల్దార్ పుష్పలత
కట్టంగూర్, అక్టోబర్ 6 : కట్టంగూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువును ఎఫ్టీఎల్ పరిధి గుర్తించి హద్దులు ఏర్పాటు చేస్తామని తాసీల్దార్ పుష్పలత అన్నారు. పెద్ద చెరువు ఆక్రమణకు గురైందని ఇటీవల బీజేపీ నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో పై అధికారుల ఆదేశాలతో మంగళవారం చెరువును రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా తాసీల్దార్ పుష్పలత మాట్లాడుతూ.. రెవిన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా చెరువుకు ఎఫ్ టి ఎల్ (పూర్తి నిల్వ సామర్థ్యం) పరిధిని గుర్తించి హద్దులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చెరువుకు ఉన్న రెండు తూములు శిథిలావస్థకు చేరాయని, చెరువులోకి వచ్చే వరద నీటి కాల్వ పూర్తిగా మట్టితో పూడుకపోయిందని, తూములకు, మరమ్మతులు పూడికతీత పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చెరువును పూర్తిగా సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని సర్వేయర్ ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో గిద్దవార్ జిబిఎస్ రామారావు, జిపిఓ అల్లావుద్దీన్, ఇరిగేషన్ శాఖ అధికారి రాజేష్, నాయకులు ముక్కామల శేఖర్, వార్డు సభ్యులు ఏనుగు సైదులు, బిజెపి నాయకులు కోమటి నర్సింహ్మ, అయితగోని శివ పాల్గొన్నారు.