e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home జిల్లాలు కోకట్‌కు కొత్తందం

కోకట్‌కు కొత్తందం

పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ కృష్ణ భాస్కర్‌

షాద్‌నగర్‌, సెప్టెంబర్‌ 24 : జిల్లాలో నూతనంగా పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలను సృష్టించే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్పత్తుల ఎగుమతిదారుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతం త్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆజాది కా అమృత్‌ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే ఎగుమతిదారుల సదస్సుకు శ్రీకారం చుట్టామని వివరించారు. జిల్లాలో పూలు, పండ్లు, కూరగాయలకు మంచి మార్కెట్‌ ఉందని, వాటిని ఎగుమతి చేసేందుకు బ్యాంకు రుణాలు ఇస్తుందని చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమలను నెలకొల్పేవారికి తక్షణమే శాఖపరమైన అనుమతులను ప్రభుత్వం ఇస్తుందనే విషయాన్ని పారిశ్రామికవేత్తలు గ్రహించాలని కోరారు. జిల్లాలో 13 రంగాలకు చెందిన 4,149 పరిశ్రమలు ఉన్నాయని, ఆహార అభివృద్ధి, రక్షణ రంగం ఉత్పత్తులు, ప్లాస్టిక్‌ రబ్బర్‌, కలప, లెదర్‌, ఇంజినీరింగ్‌, పేపర్‌, ఫా ర్మా ఉత్పత్తుల పరిశ్రమలు కొలువుదీరాయని చెప్పారు. ఉత్పత్తులను పెంచడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసర ం ఉందన్నారు. వివిధ పరిశ్రమల్లో తయారైన ఉత్పత్తులను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జై న్‌, ఎఫ్‌ఐఈవో జేడీ పీటీ శ్రీనాథ్‌, పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, బ్యాంకుల ప్రతినిధులు, ఉన్నత అధికారులు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement