ఎర్రగడ్డ : గ్రేటర్ పరిధిలో జూబ్లీహిల్స్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటం తన ముందున్న ధ్యేయమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డలోని జామా మసీదు వీధిలో రూ.44.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు గురువారం ఆయన కార్పొరేటర్ షాహీన్బేగంతో కలిసి శంకుస్థాపన చేసి సదరు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధికిగాను ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లటం జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవ్గంలో అన్నింటికన్నా వెనుకబడ్డ ఎర్రగడ్డ డివిజన్ అభివృద్ధికి నిధుల కేటాయింపు విషయంలో పెద్ద పీట వేశామని వివరించారు.
డివిజన్లోని అన్ని అంతర్గత మార్గాలను సీసీ రోడ్లుగా తీర్చిదిద్దే పనులు చివరి దశకు వచ్చాయన్నారు. ప్రతి బస్తీకి ఓ కమ్యూనిటీహాల్ ఉండే విధంగా భవన నిర్మాణాలను చేస్తున్నమన్నారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహ్మద్‌షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ, నేతలు జి.రాము, మహ్మద్సర్దార్, మహ్మద్‌అహ్మద్, ముస్తాక్, బాలకృష్ణ, జహంగీర్, సయ్యద్రసూల్, శ్రీనివాస్, మహిళాధ్యక్షురాలు కల్యాణి, బాలసూర్య, జులేకా, రాజమణి తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత..
ఎరగడ్డ డివిజన్‌కు చెందిన నలుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పంపిణీ చేశారు. పంపిణీ చేసిన చెక్కుల విలువ మొత్తం రూ.4లక్షల464 అని వీఆర్ఏ సందీప్ తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నలుగురికి మంజూరైన చెక్కులను కూడా ఎమ్మెల్యే అందజేశారు.
ఇందులో రవికుమార్, అమానుల్లాఖాన్లకు రూ.60 వేలు చొప్పున, అతియాబేగంకు రూ.24 వేలు, శ్రియకు రూ.16 వేలు మంజూరైనట్లు గోపీనాథ్ తెలిపారు.