e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సకాలంలో సబ్సిడీ విత్తనాల అందజేత
పీఏసీసీఎస్‌ల ద్వారా గిట్టుబాటు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
పీఏసీసీఎస్‌ నూతన భవనం ప్రారంభం

కోస్గి, ఏప్రిల్‌ 3 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమ ని, అందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ రైతుల కోసం అ నేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని నూతనంగా నిర్మించిన పీఏసీసీఎస్‌ భవనాన్ని డీసీసీ బీ చైర్మన్‌ నిజాంపాషాతో కలిసి శనివారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.15 లక్షలతో పీఏసీసీఎస్‌ భవనాన్ని ఆరు నెలల్లో పూర్తి చేశామని చెప్పారు. రైతుల కోసం అన్ని రకాల సబ్సిడీ విత్తనాలు అం దించడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం, రై తులకు రుణాలు పీఏసీసీఎస్‌ ద్వారా అందిజేస్తున్నామన్నా రు. రైతుల కోసం సర్కార్‌ ఎలాంటి సబ్సిడీలు అందించిన సకాలంలో అందించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్‌ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బ ందులు లేవన్నారు. ప్రతి రైతుకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయన్నారు. అనంతరం పట్టణానికి చెందిన పలువు రు యువకులు తమకు షటిల్‌ కోట్‌ కావాలని కోరడంతో అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలో మంచి ఆటస్థ లం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇ చ్చారు. అనంతరం ఎమ్మెల్యే పీఏసీసీఎస్‌ చైర్మన్‌, కార్యాలయ సిబ్బం ది, మెంబర్లను అభినందించారు.


చెక్‌డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన
మండలంలోని ముశ్రీఫాలో రూ.120.59 లక్షలతో చెక్‌డ్యాం, చెన్నారంలో రూ.253.59 లక్షలతో చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెక్‌డ్యాంల నిర్మాణం వల్ల వానకాలంలో నీరు నిల్వ ఉండడంతో భూ గర్భ జలాలు పెరిగి బోరు బావుల్లో నీటి మట్టం పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో పంటలు స మృద్ధిగా పండేందుకు అవకాశముంటుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ శాసం రామకృష్ణ, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ భీంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌, జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, ఎంపీపీ మధుకర్‌రా వు, వైస్‌ఎంపీపీ సాయిలు, కౌన్సిలర్లు, నా యకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ట్రెండింగ్‌

Advertisement