మంత్రి కేటీఆర్‌కు చీఫ్‌విప్ దాస్యం వినతి
హన్మకొండ, ఏప్రిల్ 6 : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కార్మిక భవన్, మోడ్రన్ దోబీఘాట్, షాదీఖానా, ము న్నూరుకాపు భవన్ నిర్మాణానికి సహకరించాలని, అభివృద్ధి పనులకు నిధులివ్వాలని చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని, నగరంలోని రోడ్లు, జంక్షన్లతోపాటు పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని మంత్రికి వివరించారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన భద్రకాళీ బండ్‌తో వరంగల్ నగరం కొత్త రూపు సంతరించుకుందన్నారు. కాళోజీ కళాక్షేత్ర నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, వివిధ కాలనీల్లో పార్కులు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసినట్లు చెప్పారు. గడిచిన ఐదేళ్లలో నగరం ఎంతో అభివృద్ధి చెందిందని, మిగిలి న పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని దాస్యం మంత్రి కేటీఆర్‌కు వివరించారు. మంత్రి కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించారని దాస్యం తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బుర్కా ధరించండని చెప్పి ఇబ్బందుల్లో పడిన ఇమ్రాన్‌ఖాన్
ఆర్మీకి వ్యతిరేకంగా గళమెత్తిన అందగత్తె