e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home జిల్లాలు రూ.కోటితో ముదిరాజ్‌ భవనం

రూ.కోటితో ముదిరాజ్‌ భవనం

  • చేప పిల్లల పెంపకంతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి
  • అన్ని కులాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
  • రెండు, మూడ్రోజుల్లో కొత్త మండలాల జీవో
  • కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కోస్గి /గుండుమల్‌, సెప్టెంబర్‌ 28 : నియోజకవర్గంలోని ముదిరాజ్‌ బిడ్డల కోసం కొడంగల్‌ పట్టణంలో ప్రభుత్వ స్థ లంలో రూ.కోటితో ముదిరాజ్‌ భవనా న్ని నిర్మిస్తామని కొడంగల్‌ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. భవ నం పనులను దసరా నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం గుండుమాల్‌ పెద్ద చెరు వు, తొగాపూర్‌ శివారులోని దండం చె రువులో ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేప పిల్లలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నికులాలకు పెద్దపీట వేశారని తెలిపారు. ఇం దులో భాగంగానే వివిధ పథకాల్లో ఉచి త, సబ్సిడీలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. మత్స్యకారుల కోసం ఉచితంగా చేపపిల్లలు అందిస్తున్నారని, వాటి పెంపకంతో వారు ఆర్థికంగా ఎదగాలని కోరారు. కోస్గి, మద్దూరు మండలాలకు త్వరలో మొబైల్‌ వాహనాలను అందజేస్తామని, వాటి ద్వారా నేరుగా చేపలను మార్కెట్‌కు తరలించి విక్రయించవచ్చని సూచించారు. నియోజకవర్గంలోని 99 చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేస్తున్నామని తెలిపారు. నూతనంగా ఏర్పాటైన గుండుమల్‌, కొత్తపల్లి మండలాల కు మూడ్రోజుల్లో జీవో విడుదల కానున్నదని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు భవనాలను పరిశీలించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. దసరా నుంచి ప్రభుత్వం నూతన ఆసరా పింఛన్లను మంజూరు చే స్తున్నదని, ఇంకా ఎవరైనా ఉంటే దరఖా స్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రామకృష్ణ, ఎంపీపీ మధుకర్‌రావు, జెడ్పీటీసీ ప్రకాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, స ర్పంచ్‌ విజయలక్ష్మి, మార్కెట్‌ చైర్మన్‌ వీరారెడ్డి, వైస్‌ చైర్మన్‌ వరప్రసాద్‌, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌, నాయకుడు రాజేశ్‌ పాల్గొన్నారు.

మత్స్యకారుల అభ్యున్నతికి కృషి

- Advertisement -

మద్దూరు, సెప్టెంబర్‌ 28 : మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అ న్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కా చెరువులో, అలాగే కొత్తపల్లి గ్రా మ చెరువులో ఎమ్మెల్యే చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ మత్స్యకారులను ఆర్థికంగా బలోపే తం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సబ్సిడీపై చేప పిల్లలను అందజేస్తున్నదన్నారు. వీటి పెంపకంతో ఆర్థికంగా మె రుగుపడాలని ఆకాంక్షించారు. నేడు ప్ర తి గ్రామంలో చేపలు విరివిగా లభ్యం కా వడంతోపాటు ప్రజలకు మంచి ఆహారం లభ్యమవుతున్నది పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవం సంతరించుకుంటున్నదని చెప్పారు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లపై ఆధారపడిన ముదిరాజ్‌, బెస్త కులస్తుల అభివృద్ధికి వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ శాసం రామకృష్ణ, కోస్గి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వీరారెడ్డి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ జగదీశ్‌, సర్పంచ్‌ అరుణమ్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు సలీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement