కొడంగల్, ఏప్రిల్ 8: తెలంగాణ సర్కార్ వైద్య రం గంలో వినూత్న మార్పుల కు శ్రీకారం చుడుతున్నది. గ్రామీణ ప్రజలకు సైతం కార్పొరేట్ తరహాలో నాణ్యమైన వైద్య సేవలు అం దించే దిశగా అడుగులు వేస్తున్నది. కొడంగల్ సీహెచ్‌సీ దవాఖానను ఈ మధ్య కాలంలోనే వైద్య విధాన పరిషత్‌కు అనుసంధానం చేశారు. దాంతో పాటు కొత్త భవనం రూపుదిద్దుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కొడంగల్ ప్రజలు అత్యసర పరిస్థితుల్లో హైదరాబాద్, తాండూరు, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వస్తున్నది. కొడంగల్‌లో కొత్త దవాఖాన భవనం ప్రారంభం అయితే స్థానికంగానే కార్పొరేట్ తరహా నాణ్యవైన వైద్య సేవలు అందుకునే సదుపాయం ఏర్పడనుంది. పూర్తి స్థాయిలో సిబ్బందితో , అన్ని రోగాలకు చికి త్సను పొందే అవకాశం ఏర్పడనుంది. దాంతో పాటు కొడంగల్ సీహెచ్‌సీకి డయాలసిస్ సెంటర్ మంజూరు కావడంతో కిడ్నీ సంబంధిత రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా డయాలసిస్ సెంటర్లు అందుబాటులో లేక హైదరాబాద్‌కు తరలి వెళ్లాల్సి వచ్చేదని రోగులు తెలిపారు. ఆ తరువాత వికారాబాద్, తాండూరు దవాఖానల్లో డయాలసిస్ సెంట ర్లను ఏర్పాటు చేయడంతో కొంత ఇబ్బందులు తప్పినట్లు పేర్కొన్నారు. ఇప్పడు కొడంగల్ ప్రభుత్వ దవాఖానలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తుండటంతో ఇంటి వద్దనే చికిత్స చేయించుకునే అవకాశం ఏర్పడినట్లుగా భావిస్తున్నట్లు పలువురు రోగులు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మం డలాల్లో దాదాపు 60 మంది వరకు కిడ్నీ సంబంధిత రోగులు ఉన్నారు. వారు తర చుగా ప్రత్యేక వాహనాల్లో తాండూరు పట్టణానికి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు.
ఆరేండ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. మొదట్లో హైదరా బాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఆ తరువాత మహబూబ్‌నగర్, తాండూరు పట్టణాల్లో సెంటర్లు ఏర్పాటు కావ డం తో అక్కడికి వెళ్లి చేయిం చుకుంటున్నాను.. ఐదు మండలాల్లో మొత్తంగా 60 మంది వరకు రోగులు ఉంటారు. కొడంగల్‌లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కోరాం. ఎమ్మెల్యే స్పందించి వెంటనే సెంటర్‌ను ఏర్పాటు చేయిం చడం చాలా సంతోషంగా ఉంది. పైసా ఖర్చు లేకుండా డయాలసిస్ చేయించుకునే సౌక ర్యాన్ని కల్పించిన ఎమ్మెల్యేకు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు.
-కృష్ణానాయక్, పలుగురాళ్లతండ, కొడంగల్