కమాన్‌పూర్, మారి 30: దళితుల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ సర్కారు దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. మం డ లంలోని జూలపల్లిలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌తో కలిసి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌ను బుధవారం ప్రారంభించారు. ఆదర్శనగర్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంలోని 17 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు అం దుతుందని చెప్పారు. ఈ యేడు 2.40లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం బడ్జెట్లో రూ.1700 కోట్లు కేటాయించిందని తెలిపారు. అణగారిన వర్గాల వారికి నాణ్యమైన విద్యనందించేందుకు వందకు పైగా గురుకులాలు, 30 డిగ్రీ కాలేజీలను స్థాపించిందన్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలు అక్షరాలను ఆయుధాలుగా మలుచుకొని అభివృద్ధి సాధించాలని అభిలషించారు. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. జూలపల్లిలో అంబేద్కర్ విగ్ర హం ఏర్పాటుకు కృషి చేసిన సర్పంచ్ బొల్లపెల్లి శంకర్‌గౌడ్, సహకరించిన సాన రామకృష్ణారెడ్డిని మంత్రి అభినందించారు. అలాగే జూలపల్లిలోని ఆదర్శనగర్ నుంచి ముల్కలపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ ఊరూరా మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, కమాన్‌పూర్, రామగిరి ఎంపీపీలు రాచకొండ లక్ష్మి, ఆరెల్లి దేవక్క, అంబేద్కర్ విగ్రహాల కమిటీ మం థని నియోజకవర్గ కన్వీనర్ తగరం శంకర్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సర్పంచులు సరిత, శంకర్, కొమురమ్మ, వెంకటేష్, ఎంపీటీసీ లు శంకరయ్య, ఉప సర్పంచ్ సాయికుమార్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, కోఆప్షన్ సభ్యులు ఎండీ ఇంతియాజ్, నేతలు రామారావు, రవి, రవీందర్, సాంబయ్య, రాకేష్, రామకృష్ణరెడ్డి, లక్ష్మిమల్లు, చంద్రమౌళి, మహేందర్, తిరుపతి, చందర్, శ్రీనివాస్, అనిల్ గౌడ్, వినోద్, సతీష్, సంతోష్‌రెడ్డి, సంపత్, లక్ష్మయ్యగౌడ్ ఉన్నారు.