e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home జిల్లాలు ఇక సూపర్‌ వైద్యం

ఇక సూపర్‌ వైద్యం

గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
పాత కలెక్టరేట్‌లో దవాఖాన, రైతు బజార్‌
త్వరలో కొత్త కలెక్టరేట్‌లోకి పాలనా యంత్రాంగం
జనరల్‌ దవాఖానలో ఎంసీహెచ్‌ నిర్మాణం
ఉమ్మడి జిల్లా వాసులకు మెరుగైన సేవలు

మహబూబ్‌నగర్‌, జూలై 28 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) :పాలమూరు జిల్లా కేంద్రంలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందనున్నాయి. రూ.300 కోట్లతో అధునాతన దవాఖాన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో జిల్లా కేంద్రంలోని 10 ఎకరాల సువిశాలకలెక్టరేట్‌లో 6 ఫ్లోర్లు, 4 బ్లాకులతో నిర్మించనున్నారు. వాహనాల పార్కింగ్‌కు సమస్య లేకుండా ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్ర మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) అధికారులు పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుత కలెక్టరేట్‌ భవనం కాలగర్భంలో కలిసిపోనున్నది. బుధవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, కలెక్టర్‌ వెంకట్రావు, అధికారులు పాత కలెక్టరేట్‌ పరిసరాలను పరిశీలించారు. డీఆర్డీవో భవనం శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారు. త్వరలోనే కొత్త భవనంలోకి పాలనా యంత్రాంగం మారనున్నది. ఆ తర్వాత భవనం తొలగించి కొత్త వైద్యశాల పనులు ప్రారంభించనున్నారు.

ప్రస్తుతం ప్రజలకు సేవలందిస్తున్న మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ కాలగర్భంలో కలిసిపోనున్నది. పాత కలెక్టరేట్‌ను నూతన భవనంలోకి మార్చిన తర్వాత.. ఇక్కడ ఉమ్మడి జిల్లా వాసులకు ఉపయోగపడేలా అధునాతన సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మించనున్నారు. ఇందుకుగానూ బుధవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కలెక్టర్‌ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ పరిసరాలను, భవనాన్ని పరిశీలించారు. డీఆర్డీవో భవనం శిథిలావస్థకు చేరిన పరిస్థితిని మంత్రి గమనించారు. పట్టణం నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తే ఉమ్మడి జిల్లా వాసులకు ఎంతో ప్రయోజనంగా మారనున్నదని మంత్రి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు వెం టనే అంగీకారం తెలపడంతో రూ. 300 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ వై ద్యానికి రంగం సిద్ధమైంది.

- Advertisement -

రూ. 300 కోట్లతో..
పాత కలెక్టరేట్‌ స్థానంలో పదెకరాల సువిశాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో అధునాతన సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం సేవలందిస్తున్న పాత కలెక్టరేట్‌ త్వరలో కొత్త భవనంలోకి మారనున్నది. అంతలోపే ఈ స్థలాన్ని వై ద్య, ఆరోగ్య శాఖకు స్వాధీనం చేసేందుకు ఏర్పాట్లు చే స్తున్నారు. ఇప్పటికే సీసీఎల్‌ఏ సైతం అనుమతిచ్చింది. సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను నిర్మించేందుకు ఇప్పటికే రాష్ట్ర మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) అధికారులు పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలో ఆరు ఫ్లోర్లతోపాటు, నాలుగు బ్లాకులు నిర్మించనున్నారు. ప్రస్తుతం జనరల్‌ దవాఖానలో ఉన్న అన్ని శాఖలు కూడా ఇక్కడ ప్రారంభించనున్నారు. సకల సదుపాయాలతో దవాఖాన ని ర్మించి రోగులకు అత్యాధునిక వైద్య సేవలందించేందు కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ని వాహనాలు వచ్చినా ఇ బ్బంది లేకుండా పార్కింగ్‌ సదుపాయం కల్పించనున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కులు సైతం ఏర్పాటు చేయనున్నారు. కొత్త కలెక్టరేట్‌లోకి మారక ముందే పాత కలెక్టరేట్‌ను మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఇంజినీరింగ్‌ అధికారులు భవన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. దవాఖానకు ఎదురుగా బస్టాండ్‌, సమీపంలోనే రైల్వేస్టేషన్‌ ఉండడంతో రోగులకు రవాణాపరంగా ఇబ్బందులు తీరనున్నాయి. రోడ్డు దాటేందుకు వీలుగా బస్టాండ్‌ నుంచి సూపర్‌ స్పెషలిటీ దవాఖానకు వచ్చేందుకు గానూ రెం డు ఫుట్‌ఓవర్‌ వంతెనలు నిర్మించనున్నారు. పట్టణమంతా ఐదు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు ఏర్పాటు చేయనున్నారు.

సకల సదుపాయాల పాలమూరు..
ఇప్పటికే మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ప్రభు త్వ వైద్య కళాశాల, మరో ప్రైవేట్‌ వైద్య కళాశాలలు ఉ న్నాయి. వాటికి అనుబంధంగా రెండు పెద్ద దవాఖాన లు ప్రజలకు సేవలందిస్తున్నాయి. వీటితోపాటు పట్టణంలో అనేక ప్రైవేట్‌ దవాఖానలు వెలిశాయి. ఒకప్పు డు వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్లే పరిస్థితి ఉండేది. ఇప్పుడు స్థానికంగానే సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వచ్చింది. కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో హైదరాబాద్‌లో వైద్యం అందక రోగులు మహబూబ్‌నగర్‌ వచ్చిన సందర్భాలున్నాయి. ఇక వివిధ మౌలిక వసతుల పరంగానూ మహబూబ్‌నగర్‌ దూసుకుపోతున్నది. విశాలమైన రోడ్లు, బైపాస్‌ రహదారులు, పిల్లలమర్రి, మన్యంకొండ, చుట్టూ చెరువులు, వేగంగా పను లు జరుగుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే పెద్ద పెద్ద కాలువలతో పాలమూరు సర్వాంగ సుందరంగా ముస్తాబు కానున్నది. పనులు జరుగుతున్న శిల్పారామం, ఐటీ పార్కు మహబూబ్‌నగర్‌కు వన్నె తీసుకురానున్నాయి. భవిష్యత్‌లో మహబూబ్‌నగర్‌ ఊహించనంత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నది. పాత కలెక్టరేట్‌ పరిశీలనకు వచ్చిన మంత్రి వెంట అదనపు కలెక్టర్లు తేజస్‌ నందలాల్‌ పవర్‌, కె.సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత, మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ డా.పుట్టా శ్రీనివాస్‌, జనరల్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ డా.రాంకిషన్‌, డీఎంహెచ్‌వో కృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌ ఉన్నారు.

సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలోకి వచ్చే శాఖలు..
జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌, పల్మనాలజీ, సైకియాట్రీ, డెర్మటాలజీ, ఆప్తాల్మాలజీ, రేడియాల జీ, అనస్తీషియా, పేథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, రేడియాలజీ, అన్ని రకాల ఐసీయూ సేవలతోపా టు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటా యి. ప్రస్తుతం ఉన్న పాత జనరల్‌ దవాఖానలో పీడియాట్రిక్‌, గైనిక్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు రేడియాలజీ విభాగం కూడా సేవలందించనున్నది.

సువిశాల ప్రదేశంలో సూపర్‌ వైద్యం..
మహబూబ్‌నగర్‌లో ఇప్పటికే రెండు వైద్య కళాశాలలు సేవలందిస్తున్నాయి. త్వరలో పాత కలెక్టరేట్‌లోని పదెకరాల సువిశాల ప్రదేశంలో సూ పర్‌ స్పెషాలిటీ దవాఖాన ను చరిత్రలో నిలిచిపోయేలా నిర్మిస్తాం. ఈ ద వాఖానలో సేవల కోసం హైదరాబాద్‌ నుంచి రైళ్ల లో వచ్చే రోజులు మనం చూడబోతున్నాం. పాత కలెక్టరేట్‌లోనే మూడెకరాల్లో రైతు బజార్‌, జనతా క్యాంటీన్‌ నిర్మిస్తాం. సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు దవాఖానను అడిగిన వెంటనే మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు పాలమూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు. దళారుల బెడద లే కుండా లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలి. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు ఆధారాలతో సహా రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటాం.

  • వి.శ్రీనివాస్‌ గౌడ్‌, ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి

పట్టణంలో అధునాతన వైద్య సేవలు..
ప్రస్తుతం ఉన్న జనరల్‌ దవాఖానలో వైద్య సేవలకు స్థలం సరిపోవ డం లేదు. ఈ క్రమంలో పట్టణ నడిబొడ్డున ఎం తో విలువైన పాత కలెక్టరే ట్‌ స్థలాన్ని వైద్య సేవలందించేందుకు వినియోగించడం చాలా గొప్ప విష యం. సుమారు వెయ్యి పడకల సూపర్‌ స్పెషాలి టీ దవాఖాన నిర్మాణం కానున్నది. సుదూర ప్రాం తాల నుంచి వచ్చే ప్రజలు బస్టాండ్‌ చేరుకొని అ క్కడి నుంచి ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీ మీదుగా నేరుగా ద వాఖాన చేరుకోవచ్చు. సూపర్‌ స్పెషాలిటీ దవాఖా న వచ్చేందుకు కారణమైన సీఎం కేసీఆర్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, కలెక్టర్‌ వెంకట్రావుకు కృతజ్ఞతలు.

  • శ్రీనివాస్‌, మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌, మహబూబ్‌నగర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana