e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home జిల్లాలు ధాన్యం కొనుగోళ్లలో టాప్‌

ధాన్యం కొనుగోళ్లలో టాప్‌

ధాన్యం కొనుగోళ్లలో టాప్‌

పోత్గల్‌ పీఏసీఎస్‌ పరిధిలో లక్షా25వేల క్వింటాళ్లు సేకరణ
2,014 మందికి మద్దతు ధర
23.60కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ

ముస్తాబాద్‌, జూన్‌ 20: పోత్గల్‌ వ్యవసాయ సహకార సంఘం పరిధిలో ఏడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోత్గల్‌, ఆవునూర్‌, రామలక్ష్మణపల్లె, తుర్కపల్లి, గూడూరు, మద్దికుంట, గన్నెవానిపల్లెలో 2,014మంది రైతుల నుంచి లక్షా25వేల క్విం టాళ్ల ధాన్యాన్ని సేకరించారు. 45 రోజుల్లోనే లక్షా25వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి పోత్గల్‌ సహకార సంఘం టాప్‌లో నిలిచింది. 2,014మంది రైతులకు వారంలోగా వారి బ్యాంకు ఖాతా ల్లో సుమారు 23.60కోట్ల నగదును జమ చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కొనుగోలుకు సహకరించిన అధికారు లు, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, హమాలీలు, రైతులు, రైస్‌మిల్లర్లకు సహకార సంఘం చైర్మన్‌ తన్నీరు బాపురావు కృతజ్ఞతలు తెలిపారు. వానకాలం పంటల సాగుకు సహకారం సంఘంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

మెరుగైన సేవలు
సహకార సంఘం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నాం. స్వల్ప, దీర్ఘకాలిక పంట రుణాలు, ఫౌల్ట్రీ, డైరీ రుణాల తోపాటు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందిస్తున్నాం. బహుముఖ సేవలు అందించడంతో సంతృప్తిగా ఉంది.

  • రాజేశ్వర్‌రావు, సంఘం మేనేజర్‌, పోత్గల్‌
- Advertisement -

అందుబాటులో ఎరువులు, విత్తనాలు
సంఘ పరిధిలోని గ్రామాల రైతులకు వానకాలంలో సాగుకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం. సభ్యుల స్వయం ఉపాధికి వివిధ రకాల రుణాలను అందిస్తున్నాం. సభ్యుల శ్రేయస్సే లక్ష్యంగా సేవలు అందిస్తున్నాం.

  • మేర్గు రాజేశంగౌడ్‌, వైస్‌ చైర్మన్‌, పోత్గల్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ధాన్యం కొనుగోళ్లలో టాప్‌
ధాన్యం కొనుగోళ్లలో టాప్‌
ధాన్యం కొనుగోళ్లలో టాప్‌

ట్రెండింగ్‌

Advertisement