e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home జిల్లాలు పేద బిడ్డల కోసమే కల్యాణలక్ష్మి

పేద బిడ్డల కోసమే కల్యాణలక్ష్మి

పేద బిడ్డల కోసమే కల్యాణలక్ష్మి

ప్రభుత్వ విప్‌ బాల్క సమన్‌
చెన్నూర్‌ క్యాంప్‌ కార్యాలయంలో 113 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

చెన్నూర్‌, మే 10: నిరుపేద బిడ్డల పెండ్లిల కోసమే తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను అమలు చేస్తున్నదని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. పట్టణంలోని క్యాంప్‌ కార్యాలయంలో 113 మంది లబ్ధిదారులకు చె క్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ నిరుపేద తల్లిదండ్రులు తమ ఆ డపిల్లల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం అందజేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బత్తుల సమ్మయ్య, జడ్పీటీసీ మోతె తిరుపతి, చెన్నూర్‌ వైస్‌ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, కోటపల్లి వైస్‌ ఎంపీపీ వాల శ్రీనివాస్‌రావు, సింగల్‌ విండో చై ర్మన్‌ చల్ల రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రాం లాల్‌ గిల్డా, ముల్కల్ల శశిపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జైపూర్‌ తహసీల్‌ కార్యాలయంలో..
జైపూర్‌లోని తహసీల్‌ కార్యాలయంలో జైపూర్‌, భీమారం మండలాలకు చెందిన 84 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పంపిణీ చేశారు. అనంతరం జైపూర్‌లోని పీహెచ్‌సీని తని ఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అం దించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే జైపూ ర్‌ మండలం గంగిపల్లిలో రూ 19లక్షలతో నిర్మిస్తున్న హెల్త్‌ సబ్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి శం ఖుస్థాపన చేశారు. అనంతరం కుందారంలో రైతు లు సాగు చేస్తున్న ఆయిల్‌ ఫాం తోటలను సందర్శించారు. అలాగే కొనుగోలు కేం ద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అ నంతరం వేలాల గ్రామంలో రూ 19లక్షలతో నిర్మిస్తు న్న హెల్త్‌ సబ్‌ సెంటర్‌ భవన పనులను ప్రారంభించారు.
బీమా చెక్కు పంపిణీ
భీమారం మండలం దాంపూర్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త జంగంపల్లి లక్ష్మి ఇటీవల మృతి చెందింది. ఆమె పార్టీ క్రియాశీల సభ్యత్వం కలిగి ఉండడంతో పార్టీ తరఫున రూ 2లక్షల బీ మా మంజూరు కాగా, చెక్కును ఆమె భర్త జంగంపల్లి అంకులుకు క్యాంప్‌ కార్యాలయంలో బాల్క సుమన్‌ అందజేశారు.
రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
చెన్నూర్‌, మే 10 : కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అధికారులను ఆదేశించారు. క్యాంప్‌ కార్యాలయంలో సివిల్‌ సైప్లె డీఎం గోపాల్‌తో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాల కలెక్టర్లతో మా ట్లాడి 20వేల టన్నుల ధాన్యానికి అలాట్‌మెంట్‌ ఇప్పిస్తానని, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యా న్ని వెంటవెంటనే తరలించేలా చూడాలన్నారు. చెన్నూర్‌ జడ్పీటీసీ మోతె తిరుపతి, చెన్నూర్‌ వైస్‌ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, కోటపల్లి వైస్‌ ఎంపీపీ వాల శ్రీనివాసరావు, చెన్నూర్‌, కోటపల్లి సింగిల్‌ విండో చైర్మన్లు చల్ల రాంరెడ్డి, పెద్దపోలు సాంబగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రాంలాల్‌ గిల్డా, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సబ్‌ హెల్త్‌ సెంటర్‌ పనులు ప్రారంభం..
చెన్నూర్‌ రూరల్‌, మే 10: మండలంలోని కొమ్మె ర గ్రామంలో రూ. 19 లక్షల నిధులతో చేపడుతున్న హెల్త్‌ సబ్‌ సెంటర్‌ నిర్మాణ పనులను ప్రభు త్వ విప్‌ బాల్క సుమన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుద్దాల, సుబ్బరాంపల్లి, గంగారం గ్రామాల్లోని వాగుల మీ ద వంతెన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి మందులను అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బత్తుల సమ్మయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ చల్ల రాంరెడ్డి, సర్పంచ్‌ తాళ్లపెళ్లి జయలక్ష్మి, నాయకులు కిరణ్‌ గౌడ్‌, తాటి రవీందర్‌ గౌడ్‌, వడ్లకొండ రవి, తాళ్లపెల్లి సంతోష్‌ గౌడ్‌, ఎంపీడీవో మల్లేశం, ఎంపీవో బీరయ్య, పంచాయతీ సెక్రటరీ మౌనిక ఉన్నారు.
నెలాఖరులోగా పూర్తి చేయాలి..
ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అధికారులను ఆదేశించారు. మండలంలోని ఆస్నాద్‌ గ్రా మంలో కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ధాన్యం అమ్మిన రైతుల ఖాతాలో 48 గంటలో డబ్బులు జమయ్యేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో మల్లేశం, ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, పీఏసీఎస్‌ చల్ల రాం రెడ్డి, సర్పంచ్‌ నాగభూషణం చారి, ఉప సర్పంచ్‌ నస్కూరి శ్రీనివాస్‌ రైతులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేద బిడ్డల కోసమే కల్యాణలక్ష్మి

ట్రెండింగ్‌

Advertisement