e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home జిల్లాలు రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శం

రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శం

ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు అమలు
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
దిలావర్‌పూర్‌, సోన్‌, సారంగాపూర్‌, భైంసాల్లో పలు కార్యక్రమాలకు హాజరు

దిలావర్‌పూర్‌, ఆగస్టు 5: రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి, షాదీ ము బారక్‌ చెక్కులను గురువారం ఆయన పంపిణీ చేశారు. అనం తరం మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేస్తామని, 57 ఏండ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్లను త్వరలోనే అందిస్తామని చెప్పారు. రైతులకు కూడా రూ.50 వేల బ్యాంకు రుణం మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల వర్షాలకు పంటలు నష్టపోయిన వారిని ఆదుకుంటామ న్నారు. కాగా, దిలావర్‌పూర్‌లో సర్వే నంబర్‌ 300లో ఉన్న 3.24 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేయాలని ఓ వ్యక్తి చూ స్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి గ్రా మాభివృద్ధ్ది కమిటీ సభ్యులు తీసుకెళ్లారు. ఎంపీపీ ఏలాల అమృత, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్‌ పీవీ రమణారెడ్డి, జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు సుభాష్‌రావు, స్థానిక సర్పంచ్‌లు వీరేశ్‌కుమార్‌, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు, మం డల అధ్యక్షుడు ఏలాల చిన్నారెడ్డి, కోడే రాజేశ్వర్‌, కదిలి ఆలయ చైర్మన్‌ భుజంగ్‌రావుపటేల్‌, ఎంపీటీసీలు పాల్దే అక్షర, అనిల్‌, డీ గంగవ్వ, టీఆర్‌ఎస్‌ నాయకులు దనే రవి, సప్పల రవి, గుణవంత్‌రావ్‌, రాజు, ఆనంద్‌రావు, తహసీల్దార్‌ హిమబిందు, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, ఏవో స్రవంతి, ఆర్‌ఐ సంతోష్‌, పార్టీ నాయకులు కార్యకర్తలున్నారు.
సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి భూమిపూజ
భైంసా, ఆగస్టు 5 : పట్టణంలోని మిర్చి యార్డు ఆవరణలో స మీకృత మార్కెట్‌ నిర్మాణానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి భూమి పూజ చేశారు. రూ. 7. 20 కోట్లతో ఈ మార్కెట్‌ను ప్రజా అవసరాలకు అనుగుణంగా నిర్మించనున్నట్లు చెప్పారు. దీంతో పలువురికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. భైంసా ఇప్పటికే అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని, పట్టణంలో పార్కులు, ఫౌంటేయిన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. వరదలో ముంపునకు గురైన ఆటోనగర్‌, ఎన్‌ఆర్‌ గార్డెన్‌, మైనార్టీ గురుకుల పాఠశాలను పరిశీలించారు. గుం డేగాం గ్రామానికి త్వరలోనే సీఎం కేసీఆర్‌ రూ. 26 కోట్లు మం జూరు చేయనున్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జాబీర్‌ అహ్మద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణ, వైస్‌ చైర్మన్‌ ఆసిఫ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ము రళీ గౌడ్‌, బామ్ని రాజన్న, విలాస్‌ గాదేవార్‌, జేకే పటేల్‌, తోట రాము, మంత్రి భోజారాం, తహసీల్దార్‌ విశ్వంభ ర్‌, కమిషనర్‌ అలీం, ఏఎస్పీ కిరణ్‌ ఖారే, సీఐ ప్రవీణ్‌ కుమార్‌ ఉన్నారు.
షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
సోన్‌/ సారంగాపూర్‌, ఆగస్టు 5: సోన్‌, సారంగాపూర్‌ మండ లాల్లోని రైతు వేదికలో గురువారం సాయంత్రం పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పంపిణీ చేశారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకా లను ఆపకుండా అందిస్తున్నామన్నారు. రైతులకు రూ. 50 వేల రుణమాఫీ చేయడంతో పాటు 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్‌ అందించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సోన్‌, సా రంగాపూర్‌ జడ్పీటీసీలు జీవన్‌రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మం జులాపూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, సోన్‌ టీ ఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ మోహినొద్దీన్‌, ఆర్డీవో రమేశ్‌ రాథోడ్‌, తహసీల్దార్‌ ఆరిఫా సుల్తానా, గ్రామ సర్పంచ్‌ టీ వినోద్‌, ఎంపీటీసీ లింగవ్వ, నాయకులు వెంకయిగారి శ్రీనివాస్‌రెడ్డి, అంకం శ్రీనివాస్‌, ప్రకాశ్‌రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సారంగాపూర్‌లో 47 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజే యగా, ఎంపీపీ అట్ల మహిపాల్‌ రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ అయిర నారాయణ రెడ్డి, ఆలూ ర్‌ సొసైటీ చైర్మన్‌ మాణిక్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ రాధ, ఆయా గ్రా మాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మహిపాల్‌ మురళీ కృష్ణ, సు జాత, జరాజ్‌, తహసీల్దార్‌ సంతోష్‌ రెడ్డి, ఎంపీడీవో సరోజ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
శాశ్వత పరిష్కారానికి కృషి..
నిర్మల్‌ అర్బన్‌, ఆగస్టు 5: పట్టణంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెడుతామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.డ్రైనేజీలు, నాళాల్లో పేరుకుపోయిన చెత్తను, పూడిక తీత పనులను స్థానిక శివాజీ చౌక్‌ వద్ద మున్సిపల్‌ చైర్మన్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైనేజీల్లో చెత్తాచెదారం వేయవద్దని స్థానికులకు సూచించారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్‌ నేరెళ్ల వేణు, నాయకుడు నర్సయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ, ఏఈ వినయ్‌ కుమార్‌ తదితరులున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana