తిరుమల : తిరుమలలో పచ్చదనాన్ని పెంపొందించడమే టీటీడీ లక్ష్యమని టీటీడీ ఈవో(TTD EO) జె శ్యామలరావు అన్నారు. తిరుమల(Tirumala) ను హరిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వన మహోత్సవం ( Vana Mahotsavam ) లో అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పద్మావతి విశ్రాంతి భవనంలో మొక్కను నాటారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ ఫారెస్ట్ పరిధిలో 2వేలు, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో మొత్తం రూ. 12 వేల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. తిరుమలలో ‘సీడ్ బౌల్ కాన్సెప్ట్’ (Seed Bowl Concept) అడ్వాన్స్ టెక్నాలజీతో ప్లాంటేషన్ కార్యక్రమం శాశ్వతంగా జరుపుతున్నామని వివరించారు. . టీటీడీకి భారీ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రి కూడా ఉండడం వల్ల ఈ సంస్థలకు అవసరమైన ఔషధ మొక్కలను పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతామని వెల్లడించారు.
టీటీడీ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే వందలాది మను సంపంగి , శాండల్‌వుడ్ , సీతా అశోకమొక్కలను నాటింది. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాసులు, డీఈవోలు భాస్కర్, ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ ప్రసాద్, ఇతర అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.