AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీ చేపట్టేందుకు మరో 15 రోజులు గడువు పొడిగించింది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని మెజారిటీ శాఖల్లో బదిలీలకు సంబంధించిన విధివిధానాలను రూపొందించుకోలేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ఆర్అండ్బీ, రవాణా శాఖలకు చెందిన బదిలీల మార్గదర్శకాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విధివిధానాల రూపకల్పనలోనే వివిధ శాఖలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా గడువు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.