అమరావతి : ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీని (Kadambari Jatwani) వేధించిన కేసులో అప్పటి వైసీపీ పాలనలో ఉన్న డీజీపీ, విజయవాడ సీపీని విచారణ చేయాలని టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న(Budda Venkanna) ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నాయకుల ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు వెళ్లి ఆమెపై అక్కడ బలవంతంగా కేసులు ఫ్లైట్‌లో విజయవాడకు తీసుకొచ్చి వేధించారని ఆరోపించారు.
ఈ కేసులో అనాటి వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌తో పాటు కేసు విచారణకు ఆదేశించిన డీజీపీ(DGP), సీపీ(CP) లపై కూడా విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నాకు, నా కుటంబానికి జరిగిన అన్యాయంపై జత్వాని సీబీఐ విచారణ కోరిందంటే కేసు తీవ్రతను అర్థం చేసుకోవాలని కోరారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు.
ముంబై నటి కేసును సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఏసీపీ స్రవంతి రాయ్(ACP Sravanti Roy) ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో ఆమె శుక్రవారం విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా సీపీ రాజశేఖర్‌బాబు ఆమెతో ఫొన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఏపీ పోలీసులు అక్రమ కేసు పెట్టి నన్ను, నా తల్లిదండ్రులను బెదిరించి చిత్రహింసలకు గురి చేశారని ఆమె ఆరోపించింది . ఏపీ ప్రభుత్వం నాకు న్యాయం చేయాలని కోరారు. సాయంత్రం విజయవాడ పోలీసులు ఆమెతో మాట్లాడి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేపడుతామని సీపీ వెల్లడించారు. డీజీపీ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.