శనివారం 15 ఆగస్టు 2020
Devotional - Jul 23, 2020 , 12:55:15

టీటీడీ హుండీ ఆదాయం రూ.33లక్షలు

టీటీడీ హుండీ ఆదాయం రూ.33లక్షలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కరోనా భయంతో ఆలయానికి రావడానికి భక్తులు జంకుతున్నారు. ప్రతీ రోజు 13వేల మంది భక్తులు దర్శించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా బుధవారం 5,360 మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శంచుకున్నారు.

ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.33లక్షల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. 2225 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండడంతో సర్వదర్శనం టిక్కెట్లను మూడురోజుల క్రితం రద్దు చేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన వారికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo