శుక్రవారం 22 జనవరి 2021
Devotional - Jan 13, 2021 , 12:37:21

కొండగట్టులో ఘనంగా గోదాదేవి కల్యాణం

కొండగట్టులో ఘనంగా గోదాదేవి కల్యాణం

జగిత్యాల: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో గోదాదేవి-రంగనాథ స్వామి వారికి వైభవంగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సతీమణి దీవెన‌, ఆలయ ఫౌండర్ ట్రస్టీ మారుతిస్వామి, ఈవో చంద్రశేఖర్, అర్చకులు జితేంద్రస్వామి, మారుతీ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ దంపతులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయం అయిన శ్రీ సీతా రామస్వామి వారి దేవాలయంలో గోదాదేవి, రంగనాథ స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తులు భారీగా పాల్గొన్నారు.logo