గురువారం 22 అక్టోబర్ 2020
Devotional - Oct 17, 2020 , 06:52:27

నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ దేవస్థానాల్లో ఒకటైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటినుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాలు 25న ముగియనున్నాయి. కరోనా దృష్ట్యా రోజుకు పదివేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఈనెల 21న మూలా నక్షత్రం రోజున 13 వేల మందికి దర్శనానికి అనుమతించనున్నారు.  

ఈరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో భక్తులకు అమ్మవారి దర్శనమివ్వనున్నారు. నేడు ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనాలకు అనుమతిస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనాలు చేసుకునే అవకాశం ఉంటుంది.   

దేవీ శరన్నవరా‌త్రు‌లకు రాష్ట్రం‌లోని ఆల‌యాలు ముస్తా‌బ‌య్యాయి. ప్రముఖ ఆధ్యా‌త్మిక క్షేత్రాలు వేము‌ల‌వాడ పార్వతీ ‌రాజ‌రా‌జే‌శ్వర సన్ని‌ధి‌తో‌పాటు యాదాద్రి లక్ష్శీ‌నృ‌సిం‌హ‌స్వామి ఆలయం, వరం‌గల్‌ భద్రకాళి, బాసర సర‌స్వతీ క్షేత్రం, ఏడు‌పా‌యల వన‌దు‌ర్గా‌మాత తది‌తర ఆల‌యాల్లో తొమ్మిది రోజు‌ల‌పాటు కార్యక్రమాలు అంగ‌రంగ వైభ‌వంగా జరు‌గ‌ను‌న్నాయి. అమ్మవారు రోజుకో రూపంలో భక్తు‌లకు దర్శనమివ్వనున్నారు. కరోనా నిబం‌ధ‌నల మేరకు పూజలు నిర్వహించను‌న్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo