వరంగల్ : జిల్లాలోని సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన వృద్ధుడి హత్య కేసులోని నిందితులను సంగెం పోలీసులు అరెస్టు చేసారు. మృతుడి భార్య హంస సుగుణ (53) కొడుకు అశోక్ (34) అరెస్టుకు సంబంధించి ఈస్ట్ జోన్ డిసిపి కె. వెంకటలక్ష్మి వివరాలను మీడియాకు వెల్లడించారు. మృతుడు హంస సంపత్ వరంగల్ నగరంలో లాడ్లో పనిచేసిన సమయంలో పరిచయం అయిన స్త్రీలతో అక్రమ సంబంధాన్ని కొనసాగించేవాడు.
కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా తన పద్ధతిని మార్చుకోలేదు. విసుగు చెందిన తల్లీ కొడుకులు ఈ నెల 3 తేదీన కత్తితో గొంతులో పొడిచి ఉరివేసుకొని చనిపోయినట్లు నాటకమాడారని తెలిపారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న సంగెం పోలీసులు మామూనూర్ ఎసిపి నరేష్ కుమార్ పర్యవేక్షణలో పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, సంగెం ఎస్.ఐ భాస్కర్ రెడ్డి అధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు హత్యకు పాల్పడిన భార్య సుగుణ, చిన్న కొడుకు అశోక్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారని డిసిపి తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను డీసీపీ అభినందించారు.
ఇవి కూడా చదవండి..
డీసీపీ కార్యాలయ సిబ్బంది ఔదార్యం..వృద్ధురాలికి చేయూత
Ind vs Eng | ఇంగ్లండ్ గెలుస్తుందా? చేజింగ్‌లో ఆ టీమ్ రికార్డేంటి? ఓవల్ పిచ్ ఎలా ఉంది?
కందకుర్తి వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం