శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 12, 2020 , 09:07:01

ప్రేమ వివాహం చేసుకున్న జంట.. ఒకరు హతం, మరొకరు ఆత్మహత్య

ప్రేమ వివాహం చేసుకున్న జంట.. ఒకరు హతం, మరొకరు ఆత్మహత్య

ఫతేపూర్‌ : ప్రేమ వివాహం ఓ జంటను బలితీసుకుంది. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుందన్న కోపంతో యువతి కుటుంబీకులు ఆమె భర్తను హతమార్చగా.. ఆవేదనలో యువతి సైతం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్‌ జిల్లాలో జరిగింది. లోహ్తా గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్‌ రింకీ రాజ్‌పూర్ (27) ఓ యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ వివాహం ఇష్టం లేని రింకీ కుటుంబీకులు గత నెల 27న ఆమె భర్తను హత్య చేశారు.

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి వద్ద సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ‘భర్త హత్యను తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రింకీ పేర్కొంది’ అని ఏఎస్పీ రాజేశ్‌ కుమార్‌ తెలిపారు. హత్యకు కేసులో రింకీ తండ్రి, సోదరుడు, మామలను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo