మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Sep 17, 2020 , 10:20:34

బాలిక‌ను బెదిరించి రూ.4 ల‌క్ష‌లు వ‌సూలు చేసిన యువ‌కులు

బాలిక‌ను బెదిరించి రూ.4 ల‌క్ష‌లు వ‌సూలు చేసిన యువ‌కులు

హైద‌రాబాద్‌: నగరంలోని జీడిమెట్ల పరిధి అయోధ్యనగర్‌లో బాలికను బ్లాక్‌ మెయిల్ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ముగ్గురు యువకులు.. ఆమె ఫొటోలు తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. ఫొటోల‌ను మార్ఫింగ్ చేస్తామ‌ని బాలికను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ విడ‌త‌ల వారీగా రూ.4 లక్షలు వసూలు చేశారు. 

ఈక్ర‌మంలో గ‌త సోమ‌వారం (ఈనెల 14న) ముగ్గురు యువకులు బాలిక ఇంటికి వ‌చ్చారు. దీంతో అమ్మాయి త‌ల్లిదండ్రులు వారిని ప్ర‌శ్నించారు. పదోతరగతి మెటీరియల్ కోసం వచ్చినట్లు ముగ్గురు యువకులు వారికి తెలిపారు. అయితే వారిపై అనుమానం రావ‌డంతో బాలికను నిలదీయగా అసలు విషయం తెలిపింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు ఎలిశా, కిశోర్‌, రాంవికాస్‌గా గుర్తించారు.  


logo