భర్త వద్దంటే పనికి వెళ్లాడని భార్య ఆత్మహత్య
భర్త వద్దంటే పనికి వెళ్లాడని | భర్త వద్దన్నా పనికి వెళ్లడంతో మనస్థాపం చెంది భార్య ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

వికారాబాద్ : భర్త వద్దన్నా పనికి వెళ్లడంతో మనస్థాపం చెంది భార్య ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన జిల్లాలోని కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం, ఐనెల్లి గ్రామంలో వడ్డె రేణుక (26) ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దులానికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
మంగళవారం రాత్రి భర్త వడ్డే సిద్ధు గ్రామంలోని కుర్వ రాములు ఇంట్లో ఎలక్ట్రిషీయన్ పని ఉందని భార్య రేణుకతో చెప్పాడు. రాత్రి సమయంలో పనికి పోవద్దని భార్య వారించింది.
అయినా భర్త సిద్ధు వినిపించుకోకుండా పనికి వెళ్లాడు. భార్య మనస్థాపానికి గురై ఇంట్లో దులానికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో పని ముగించుకొని సిద్ధు ఇంటికి వచ్చాడు.
అప్పటికే భార్య రేణుక ఉరేసుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని స్థానికంగా ఉండే రేణుక తండ్రి వడ్డే వెంకటయ్యకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్పై యువతి మృతదేహం
Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

