ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 25, 2020 , 12:07:49

శ్రీనగర్‌లో కాల్పులు.. ఉగ్రవాది హతం

శ్రీనగర్‌లో కాల్పులు.. ఉగ్రవాది హతం

శ్రీనగర్‌ : శ్రీనగర్ శివారులో శనివారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్తు తెలియని ఉగ్రవాది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నగర శివార్లలోని రణబీర్‌నగర్‌ ప్రాంతంలో భద్రతా దళాలు ఈ రోజు ఉదయం ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. దళాలు వెతుకులాడుతుండగా ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వారి కాల్పులకు దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయని అధికారి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo