ములుగు : జిల్లాలోని మంగపేట మండలం నీలాద్రి పేట గ్రామంలో గత కొంత కాలంగా కలప స్మగ్లింగ్ చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు.. అటవీ శాఖ అధికారులు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లక్ష రూపాయల విలువైన పెద్దేగి, జిట్రేగి కర్ర దుంగలు లభించినట్లు మంగపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి షకీల్ పాషా తెలిపారు.
పట్టుకున్న కలపను మంగపేట రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలను చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పు.. ఇది హిందూయిజం కాదని వ్యాఖ్య
Home Loans Best Time | ఇండ్ల కొనుగోలుకు ఇదే బెస్ట్ టైం.. ఈ బ్యాంకుల్లో మరింత తగ్గిన వడ్డీరేట్లు
Bjp | బీజేపీ నేతలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్