Bjp | బీజేపీ నేతలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్
మంత్రి సత్యవతి రాథోడ్ | గిరిజనుల పేరుతో రాజకీయాలు చేస్తున్న రాష్ట్రబీజేపీ నేతలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.

హైదరాబాద్ : గిరిజనుల పేరుతో రాజకీయాలు చేస్తున్న రాష్ట్రబీజేపీ నేతలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. నరం లేని నాలుక అని అబద్ధాలతో గిరిజనులను మోసం చేయలేరని ఫైర్ అయ్యారు. అగ్రవర్ణాల కొమ్ముకాస్తూ గిరిజన, దళితులను అణచివేస్తూ, వారి రిజర్వేషన్లను కొల్లగొడుతుంది బీజేపీ ప్రభుత్వమని దుయ్యబట్టారు.
నిజంగా గిరిజనుల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన దానిని ఆమోదించాలని సవాల్ విసిరారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలని, మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని, కొట్టివేసిన జీవో 3ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజనుల ఆత్మగౌరవం పెరిగిందని, అభివృద్ధి జరిగిందని, సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లుతున్నాయని చెప్పారు. గిరిజనుల దీర్ఘకాల డిమాండ్ తండాలను గ్రామ పంచాయతీలు చేసి, గిరిజన ఆవాసాలకు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చింది కండ్లకు కనిపిండం లేదా అని ప్రశ్నించారు.
మేడారం జాతరకు గత మూడు దఫాలుగా 300 కోట్లు కేటాయించి, కుమురం భీం, బంజారా భవన్ వంటి ఆత్మగౌరవ భవనాలు నిర్మించారు. సేవాలాల్ జయంతి, కుమురం భీం జయంతిలను అధికారికంగా నిర్వహించి, ప్రతి పండగకు నిధులు కేటాయిస్తూ వాటిని సగౌరవంగా నిర్వహిస్తున్న గొప్ప ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు.
గిరిజనులకు టీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీలో అన్యాయం జరిగిందని మాట్లాడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గిరిజనుల చరిత్ర గురించి తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. టీఆర్ఎస్ పార్టీ రవీందర్ నాయక్‌ను అగౌరపరిచిందని బీజేపీ పార్టీ వాళ్లు అంటున్నారు. జనరల్ సీట్ ఇచ్చి ఆయనను ఎంపీ చేసి పార్లమెంట్ కు పంపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గుంట భూమి, సొంత బిల్డింగ్ ఇవ్వకున్నా గత సంవత్సరమే వీసీని నియమించి, ట్రైబల్ యూనివర్సిటీలో తరగతులు నిర్వహిస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇచ్చినా ఎందుకు నిర్వహిస్తలేరో తెలంగాణ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి తండాలో సేవాలాల్ దేవాలయాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు. మరి దేశంలో 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్ని దేవాలయాలు కట్టించారో చెప్పాలన్నారు. సేవాలాల్ స్వస్థలం మహారాష్ట్రలో కూడా అధికారంలో ఉండి కట్టించలేదు కదా? అని సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ గొప్పగా జరుపుతున్నాం. ప్రతి జిల్లా కేంద్రంలో గిరిజన భవనాల కోసం స్థలం కేటాయించి, నిధులను విడుదల చేశాం. ఇవి నిర్మాణంలో ఉన్నాయన్న సంగతి గుర్తిస్తే మంచిదని చురకలంటించారు. ఇవన్నీ చూడకుండా, చెప్పకుండా గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా అగ్రవర్ణాల కొమ్ముకాసే ఈ బీజేపీకి లేదని ఘాటుగా విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP Leaders
- CM KCR
- fires
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

