బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 10, 2020 , 16:08:38

అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలు పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలు పట్టివేత

యాదాద్రి భువనగిరి : అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను భువనగిరి పట్టణ పోలీసులు పట్టుకున్న సంఘటన పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పట్టణ సీఐ సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కారులో ఇద్దరు వ్యక్తులు డిటోనేటర్స్‌, జిలిటెన్‌ స్టిక్స్‌ అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో పట్టణంలో డాల్ఫిన్‌ హోటల్‌ వద్ద నిఘా వేశారు. అదే సమయంలో కారును ఆపి తనిఖీ చేయగా అందులో 1792 జిలిటెన్‌ స్టిక్స్‌, 1600 డిటోనేటర్స్‌ను గుర్తించారు. 

వాటిని స్వాధీనం చేసుకొని కారులో ఉన్న హైదరాబాద్‌కు చెందిన కందాడి వెంకట్‌రెడ్డి, డ్రైవర్‌  భాస్కర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఈ పదార్థాలను వలిగొండ మండలం నుంచి హైదరాబాద్‌లోని శ్రీను, వెంకట్‌రెడ్డి అనే వ్యక్తులకు సరఫరా చేయడానికి తీసుకువెళ్తున్న క్రమంలో  అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


logo