శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 09, 2020 , 18:23:53

ఫ్రెండ్‌ చెల్లెలితో సంబంధం.. కిడ్నాప్‌ నాటకమాడి హత్య

ఫ్రెండ్‌ చెల్లెలితో సంబంధం.. కిడ్నాప్‌ నాటకమాడి హత్య

ఘజియాబాద్‌ : స్నేహితుడి సోదరితో సంబంధం పెట్టుకున్నాడు. వద్దని వారించినందుకు కిడ్నాప్‌ నాటకమాడి స్నేహితుడిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టం ఘజియాబాద్‌లోని విజయనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాలు.. విజయనగరానికి చెందిన విపిన్‌ అనే యువకుడు తన మిత్రుడితో ఉద్యోగం కోసమని వెళ్లాడు. ఆ తరువాత విపిన్‌ను కిడ్నాప్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రూ.20 లక్షలు డిమాండ్‌ చేస్తూ ఫోన్‌ కాల్‌ వచ్చింది. మరుసటి రోజే యువకుడిని చంపి మృతదేహాన్ని గౌతమ్‌ బుద్ధనగర్‌లోని బద్లాపూర్‌ ప్రాంతంలో పడేశారు.  ఈ సీన్‌ ఇక్కడికి కట్‌ చేస్తే..

విపిన్ విజయనగరంలోని శాంతినగర్ ప్రాంతంలో నివసించేవాడు. పొరుగున నివాసముండే అతడి స్నేహితుడు దీపక్‌.. విపిన్‌ సోదరితో సంబంధం పెట్టుకున్నాడు. ఇది విపిన్‌కు నచ్చక పోవడంతో దీపక్‌ను పలుమార్లు మందలించాడు. ఇదే విషయమై విపిన్‌ దీపక్‌ను కొట్టాడు కూడా. తనను కొట్టినందుకు దీపక్ విపిన్‌పై కోపం పెంచుకున్నాడు. తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకుని తన స్నేహితులు అశ్శు, రోహిత్‌లకు ఈ విషయం చెప్పి ఉంచాడు. 

శుక్రవారం దీపక్ ఉద్యోగం పేరిట విపిన్‌ను గ్రేటర్ నోయిడాలోని చప్రౌలాకు తీసుకెళ్లి అక్కడ ఇటుకతో దాడి చేసి హత్య చేశాడు. తరువాత పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు మిత్రులు అశ్శు, రోహిత్‌లకు ఫోన్‌ చేసి కిడ్నాప్‌ నాటకమాడాడు. 

పోలీసులు దీన్ని మొదట కిడ్నాప్ కేసుగా పరిగణలోకి తీసుకొని ముందు దీపక్‌ను విచారించి వదిలేశారు. తరువాత అతడి ఫోన్‌ పరిశీలించగా అశ్శు, రోహిత్‌లకు పలుమార్లు కాల్‌ చేసినట్లు ఉండడంతో ఆ నెంబర్లకు ఫోన్‌ చేసి విచారించగా అసలు విషయం బయట పడింది. పోలీసులు అశ్శు, రోహిత్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా దీపక్‌ పేరు బయటకు రావడంతో పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo