పెద్దపల్లి : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి ఆర్డీవో ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్‌గా పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ వ్యవహరిస్తున్నారు. కాగా, కాంట్రాక్టర్ రజనీకాంత్ చేసిన పనులకు బిల్లులు చెలించేందుకు కొన్నిరోజులుగా రజనీకాంత్‌ను ఆర్డీఓ ఇబ్బందులు పెడుతున్నాడు.
పర్సంటేజ్ ఇస్తేనే సంతకం పెడుతానని ఆర్డీఓ స్పష్టం చేశాడు. దీంతో రజనీకాంత్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు కాంట్రాక్టర్ రజనీకాంత్ ఇచ్చిన లక్ష రూపాయలను తన బంధువు ద్వారా తీసుకుంటుండగా ఆర్డీవోను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్య కాపురానికి రాలేదని కొడుకును చంపిన తండ్రి
Electric shock | కరెంట్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి
కేంద్ర మంత్రులు చెప్పేవన్నీ అబద్ధాలే : మంత్రి హరీశ్‌రావు