వరంగల్ : జిల్లాలోని కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో లైంగికదాడి నేరానికి పాల్పడిన కాజీపేట ప్రాంతానికి చెందిన బానోత్ రాకేష్ అనే నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు కాజీపేట ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి నిందితుడికి పీడీ యాక్ట్ ఉత్తర్వులను జనగామ సబ్ జైలులో జైలర్ సమక్షంలో అందజేసి అనంతరం నిందితుడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
పీడీ యాక్ట్ అందుకున్న నిందితుడు గత సెప్టెంబర్ 20వ తేదిన ఓ మహిళపై లైంగిక పాల్పడటంతో కాజీపేట్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిపై గతంలోను మహిళలపై
లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడిన సంఘటల్లో కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 11 కేసులు నమోదు కావడంతో పాటు, హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఒక కేసును పోలీసులు నమోదు చేసారు.
నిందితుడిపై గతంలోను మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. మహిళలపై లైంగిక దాడులకు, వేధింపులకు పాల్పడిన పారిపట్ల కఠినంగా ఉంటామన్నారు. అలాంటి వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
తీన్మార్ మల్లన్న జర్నలిస్టే కాదు : మంత్రి కొప్పుల
రైతు సంఘాల కమిటీకి సర్కార్ తాజా ప్రతిపాదన : నిర్ధిష్ట హామీలకు ఎస్కేఎం పట్టు
Nallagonda | సంతోషిమాత ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు
కుప్పకూలిన హెలికాప్టర్లో బిపిన్ రావత్ : వాయుసేన