శనివారం 16 జనవరి 2021
Crime - Nov 16, 2020 , 15:33:22

న్యూసెన్స్ వ‌ద్ద‌న్నందుకు వృద్ధ దంప‌తుల దారుణ‌హ‌త్య‌!

న్యూసెన్స్ వ‌ద్ద‌న్నందుకు వృద్ధ దంప‌తుల దారుణ‌హ‌త్య‌!

రాంచి: ‌జార్ఖండ్ రాష్ట్రం గుమ్లా జిల్లాలో ఓ విషాద‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌మ‌ ఇంటి ఆవ‌ర‌ణ‌లో మద్యం సేవిస్తూ న్యూసెన్స్ చేయ‌వ‌ద్ద‌ని వారించినందుకు కొంద‌రు వ్య‌క్తులు వృద్ధులైన దంప‌తులిద్ద‌రినీ కొట్టిచంపారు. గుమ్లా జిల్లా గుమ్లాన‌‌గర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని స‌త్పారా గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. స‌త్పారా గ్రామంలో సైని గాప్ (70), ఫూలో దేవి (65) అనే వృద్ధ దంప‌తులు నివ‌సిస్తున్నారు. 

అయితే, వారి ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఖాళీ ప్ర‌దేశం ఉండ‌టంతో కొంద‌రు‌ నిత్యం అక్క‌డ మ‌ద్యం తాగుతూ న్యూసెన్స్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆదివారం సాయంత్రం అక్క‌డ మందుబాబులు తిష్ట‌వేయ‌డంతో వృద్ధ దంప‌తులు వారిని నిల‌దీశారు. అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని హెచ్చ‌రించారు. దాంతో కోపోద్రిక్తులైన కొంద‌రు మందుబాబులు వారిని తీవ్రంగా కొట్ట‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు ఐదుగురు నిందితుల‌పై కేసు న‌మోదు చేసి గాలింపు చేప‌ట్టారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.