మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Aug 25, 2020 , 21:27:05

భార్య, అత్తను నరికి చంపిన అల్లుడు

భార్య, అత్తను నరికి చంపిన అల్లుడు

కాన్పూర్ : ఓ వ్యక్తి తన భార్య, అత్తను కొడవలితో విచక్షణా రహితంగా నరికి హత్యచేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టం కన్నౌజ్ జిల్లాలో గురువారం చోటుచేసుకోగా.. కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు సోమవారం తెలిపారు.

సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాదేశిక పరిధిలోని హౌదాపూర్వా గ్రామానికి చెందిన పవన్‌ తన భార్య సవిత(25), అత్త కళావతి(65)తో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. పవన్‌ తరచూ మద్యం సేవించి వచ్చి తన భార్యతో గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కూడా పవన్‌ ఫూటుగా మద్యం సేవించి వచ్చి భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవలో కళావతి జోక్యం చేసుకొని కూతురిని వెనుకేసుకొచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన పవన్‌ కొడవలితో ఇద్దరినీ విచక్షణా రహితంగా నరికి హత్య చేశాడు. ఆ తరువాత రెండు మృతదేహాలను పెరట్లో పడేసి పారిపోయాడు. 

స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని పెరట్లో ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మరుసటి రోజు తానే హత్య చేశానని పవన్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని సర్కిల్ ఆఫీసర్ సదర్ శేష్మణి ఉపాధ్యాయ్ సోమవారం తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo