Cyber Fraud | టెలిగ్రాం లింక్ క్లిక్ చేసి రూ. 9 లక్షలు పోగొట్టుకున్నాడు
సైబర్ నేరాలపై పోలీసులు, ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంచుతున్నా ఆన్లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతున్నారు. రోజుకో స్కామ్‌తో అమాయకుల నుంచి కేటుగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు.
ముంబై : సైబర్ నేరాలపై పోలీసులు, ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంచుతున్నా ఆన్లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతున్నారు. రోజుకో స్కామ్‌తో అమాయకుల నుంచి కేటుగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. లేటెస్ట్గా ముంబైకి చెందిన ఓ వ్యక్తి టెలిగ్రాం లింక్‌పై క్లిక్ చేయడంతో ఏకంగా రూ. 9.35 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం వెలుగుచూసింది. బాధితుడిని గుర్తుతెలియని వ్యక్తి సంప్రదించి పార్ట్‌టైం జాబ్ ఆఫర్ పేరుతో ముగ్గులోకి లాగాడు. పనిచేసేందుకు నిందితుడు పంపిన లింక్‌ను క్లిక్ చేయగానే తన యూపీఐ ఐడీకి కనెక్ట్ అయిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు పోగొట్టుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేసే వ్యక్తి (40)కి నెల్సన్ మీడియా హెచ్ఆర్ ప్రతినిధిగా చెప్పుకున్న మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తూ ప్రతి టాస్క్‌కు రూ. 130 సంపాదించవచ్చని ఆఫర్ ప్రతిపాదించింది. జాబ్‌లో భాగంగా హోటల్స్‌కు రేటింగ్ ఇచ్చేందుకు తాను పంపిన లింక్‌ను క్లిక్ చేయాలని కోరింది. బాధితుడు లింక్‌ను క్లిక్ చేయగానే అది టెలిగ్రాం యాప్ పేజ్‌లోకి వెళ్లి తన యూపీఐ ఐడీని ఎంటర్ చేయాలని కోరింది. ఆపై టాస్క్ పూర్తిచేయగానే తన ఖాతాలో రూ. 150 జమ అవడంతో బాధితుడు స్కామర్లను పూర్తిగా నమ్మాడు.
ఆపై ఇతర హోటల్స్‌కు రేటింగ్స్ ఇవ్వాలని కోరగా ఆయా టాస్క్‌లు పూర్తవగానే బాధితుడి ఖాతాలో రూ. 900 డిపాజిట్ అయ్యాయి. ఇక స్కామర్లు ప్రోత్సహించడంతో బాధితుడు రూ. 2000 ఇన్వెస్ట్ చేయగా కొద్ది గంటల్లోనే తన ఖాతాలో రూ. 2800 క్రెడిట్ అయ్యాయి. ఇక మరుసటి రోజు రూ. 7000. రూ. 45,000, రూ. 98,000 వస్తాయని మభ్యపెడుతూ మూడు టాస్క్‌లు అప్పగించారు. వారు చెప్పిన విధంగానే ఇన్వెస్ట్ చేయగా బాధితుడికి ఎలాంటి రిటన్స్ రాలేదు. తన డబ్బు తిరిగి రాలేదని బాధితుడు స్కామర్లను సంప్రదించగా గతంలో పెట్టుబడి పెట్టిన మొత్తం, లాభాలు కలిపి పెద్దమొత్తం అందుకునేందుకు రూ. 2 లక్షలు చెల్లించాలని కోరారు. అలా మొత్తం రూ. 9 లక్షల వరకూ వసూలు చేసినా తన డబ్బు వెనక్కురాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Read More :
అమ్మమ్మల కాలం నాటి సలహాలే ఇప్పటి బిజినెస్ ఐడియాలు!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

