అమ్మమ్మలు, నానమ్మల సలహాలు బిజినెస్ ఐడియాలు అవుతున్నాయి. తరాలనాటి చిట్కాలు ఖరీదైన ప్యాకింగ్‌తో మాల్స్‌లో ప్రత్యక్షం అవుతున్నాయి. సౌందర్య సమస్యలకు పాతలోనే కొత్త పరిష్కారం వెతుకుతున్నది నేటి తరం.
నాభి చికిత్స
గోరువెచ్చని నూనెతో నాభి చుట్టూ మర్దన చేయడం వల్ల శరీరంలో వాత-పిత్త-కఫ.. త్రిదోషాలూ తొలగిపోతాయని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. నైకా సహా అనేక బ్రాండ్లు నాభి చికిత్స తైలాలను విక్రయిస్తున్నాయి. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాయి.
వేప దువ్వెన
ఇదో ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తి. వేపతో వేల లాభాలున్నాయని మన పెద్దలెప్పుడో గుర్తించారు. ఇందులో యాంటీసెప్టిక్ గుణాలు అధికం. వేప కర్రతో చేసిన దువ్వెనలు చుండ్రును నివారిస్తాయని, వెంట్రుకలు చిట్లిపోకుండా అడ్డుకుంటాయని అధ్యయనాలు నిరూపించాయి. ఆన్లైన్లో వేప దువ్వెనలకు మంచి గిరాకీ ఉంది.
బీట్రూట్ లిప్‌స్టిక్
రంగు అంటే బీట్రూట్దే. ఆ వన్నె లిప్‌స్టిక్ పెదాలను తలపిస్తుంది. అంతకు పదిరెట్ల మెరుపు కనిపిస్తుంది. కాబట్టే, బీట్రూట్తో లిప్‌స్టిక్ తయారు చేస్తున్నాయి చాలా కంపెనీలు. ఇందులో రసాయనాలు ఉండవు కాబట్టి, దుష్ప్రభావాల ముచ్చటే లేదు. ..ఇప్పటికే పసుపు, తేనె, కుంకుమ పువ్వు సౌందర్య ఉద్దీపన సాధనాల మార్కెట్‌ను ఏలేస్తున్నాయి.