మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Sep 23, 2020 , 15:38:39

ఐపీఎల్ బెట్టింగ్‌: ఆరుగురు అరెస్ట్‌.. 6 ల‌క్ష‌లు స్వాధీనం

ఐపీఎల్ బెట్టింగ్‌: ఆరుగురు అరెస్ట్‌.. 6 ల‌క్ష‌లు స్వాధీనం

బెంగ‌ళూరు: ఐపీఎల్ బెట్టింగ్ నిర్వ‌హిస్తున్న ఆరుగురిని క్రైంబ్రాంచ్ పోలీసులు క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరులో అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6 ల‌క్ష‌లు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామ‌ని జాయింట్ సీపీ సందీప్ పాటిల్ తెలిపారు. వీరిపై క‌ర్ణాట‌క‌లోని మ‌న‌స్వాడీ, మ‌ల్లేశ్వ‌రంలో రెండు కేసులు న‌మోద‌య్యాయ‌ని వెల్ల‌డించారు.  

ప్రపంచంలోనే అత్యంత ఖ‌రీదైన టోర్నీల్లో ఒక‌టైన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ ఈ నెల 19న యూఏఈలో ప్రారంభమైంది. దేశంలో క‌రోనా కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో ఈ ఏడాది అర్‌బ్ నిర్వ‌హిస్తున్నారు. యూఏఈలోని అబుదాబీ, షార్జా, దుబాయ్ వేదిక‌ల్లో న‌వంబ‌ర్ 10 వ‌ర‌కు ఈ టోర్నీ జ‌రుగుతుంది.    


logo